Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ చేస్తారనే భయంతో న్యాయమూర్తులు బెయిల్ ఇవ్వడం లేదు.. సీజేఐ సంచలన వ్యాఖ్యలు 

కింది స్థాయి న్యాయమూర్తులు తమను టార్గెట్ చేస్తారన్న భయంతో బెయిల్ మంజూరు చేసేందుకు వెనుకాడుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఒక అభినందన కార్యక్రమంలో CJI చంద్రచూడ్ పాల్గొన్నారు.  

Judges Reluctant To Grant Bail For Fear Of Being Targeted: Chief Justice
Author
First Published Nov 20, 2022, 1:09 PM IST

సుప్రీంకోర్టు సీజేఐ: అట్టడుగు స్థాయి న్యాయమూర్తులు తమను టార్గెట్ చేస్తారన్న భయంతో బెయిల్ మంజూరు చేసేందుకు వెనుకాడుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్  అన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించాలని, ఈ మేరుక తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుప్రీంకోర్టులోని మొత్తం 13 బెంచ్‌లు ఉన్నాయనీ, ప్రతి బెంచ్  ప్రతిరోజూ 10 బెయిల్ పిటిషన్లను, 10  మ్యాట్రిమోని పిటిషన్లను విచారించాలని ఆయన నియమం పెట్టారు. కింది కోర్టులు బెయిల్‌ను తిరస్కరించడంతో హైకోర్టులు బెయిల్‌ పిటిషన్లతో నిండిపోతున్నాయని సీజేఐ అన్నారు. కింది కోర్టుల న్యాయమూర్తులు బెయిల్ మంజూరు చేయడానికి వెనుకాడుతున్నారనీ,  క్రూరమైన నేరాలలో బెయిల్ మంజూరు చేయడం ద్వారా వారిని టార్గెట్ చేస్తారనే భయంతో వారు వాటిని దూరం పెట్టుతున్నారని అన్నారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ చంద్రచూడ్ ఈ విషయాలను వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులపై సీజేఐ సీరియస్

అంతకుముందు సుప్రీంకోర్టులోని ప్రతి బెంచ్‌లో ప్రతిరోజూ 10 బెయిల్ పిటిషన్లు,10 బదిలీ కేసులను విచారించాలని సీజేఐ చంద్రచూడ్ నియమం పెట్టారు. దీంతో బెయిల్ , కేసు బదిలీకి సంబంధించిన 130-130 కేసులు సుప్రీంకోర్టులో ప్రతిరోజూ విచారణకు రానున్నాయి. ఒక్క వారంలో 650 పెండింగ్‌ కేసులను విచారించనున్నారు. దీంతో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు తగ్గుతాయని సూచించారు. కేసులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన 3 వేలకు పైగా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిలో చాలా వరకు వివాహ వివాదాలకు సంబంధించినవేననీ, ప్రతి బెంచ్ వారంలో 650 కేసులను విచారిస్తే.. ఈ కేసులన్నీ ఏడాదిలో విచారణకు వస్తాయని ఆయన చెప్పారు. దీంతో పెండింగ్‌లో ఉన్న కేసులను సులభంగా పరిష్కరించడంతోపాటు ప్రజలకు న్యాయం జరిగేందుకు ఇబ్బంది ఉండదని అన్నారు. 

మాజీ సీజేఐ కూడా అదే పని చేశారు

పెండింగ్‌లో ఉన్న కేసును పరిష్కరించాలని మాజీ సీజేఐ యూయూ లలిత్ పలుమార్లు సూచించారు. ఆయన  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేవలం 74 రోజులే సేవలందించారు. కానీ తన పదవీ కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఎన్నో నిబంధనలు రూపొందించారు. ఆయన రోజురోజుకు విచారణకు సంబంధించిన కేసుల సంఖ్యను పెంచారు. అయితే.. దీని కారణంగా న్యాయమూర్తుల పనిభారం చాలా ఎక్కువైంది. కొత్త కేసుల విచారణకు ఈ నిబంధన సమయం ఇవ్వడం లేదని జస్టిస్ సంజయ్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం సెప్టెంబర్ 13న పేర్కొంది.

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 9న సీజేఐ చంద్రచూడ్ నియమితులయ్యారు. నవంబర్ 10, 2024 వరకు ఆయన సీజేఐగా సేవలందిస్తారు. నవంబర్ 9న పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios