Minister KTR: గాంధీని పూజిస్తావా..? గాడ్సేని పూజిస్తావా..? దమ్ముంటే నిజామాబాద్‌లో చెప్పాలని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Minister KTR: ఇందూర్ ప్రజా గర్జన సభలో ప్రధాని మోడీ మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గాంధీని పూజిస్తావా..? గాడ్సేని పూజిస్తావా..? దమ్ముంటే నిజామాబాద్‌లో చెప్పాలని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దమ్ముంటే నిజాంబాద్ లో చెప్పు నువ్వు గాంధీని పూజిస్తావా? లేదా గాడ్సేని పూజిస్తావా? నీ పార్టీ ఎవరిని పూజిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
గాడ్సేను ఆదరించే ఆరాధించే దుర్మార్గపు పార్టీ బిజెపి అనీ, జాతిపిత మహాత్మా గాంధీని చంపిన మొట్టమొదటి టెర్రరిస్ట్ నాథురం గాడ్సే అనే ఒక వెధవ వాడిని ఆరాధించే దిక్కుమాలిన పార్టీ బీజేపీ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన పార్టీ మన దేశానికి అవసరమా? అని ప్రశ్నించారు. ఇట్లాంటి దుర్మార్గులతో పొత్తుపెట్టుకునే కర్మ తమకు లేదని అన్నారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ పై విరుచుకుపడుతూ.. ఇవాళ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తిని, ఓటుకు నోటు దొంగను ఇవాళ పార్టీ ప్రెసిడెంట్‌గా పెట్టుకున్న నక్కజిత్తుల కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా పొరపాటున కూడా నమ్మొద్దని అన్నారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజయ్ ని మంచి మెజారిటీతో గెలిపించండని కోరారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుందామనీ, మంచి పరిశ్రమలు తెచ్చుకుందామనీ, పట్టణాన్ని అన్ని విధాలు బాగు చేసుకుందామని, నియోజకవర్గాన్ని కూడా బాగా చేసుకుందామని అన్నారు. జగిత్యాలను రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
