అంగన్ వాడీ జాబ్స్ ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి పదే పదే..
అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానని 20 మంది మహిళలపై పలువురు సామూహిక అత్యాచారానికి (20 women gang-raped on the pretext of providing anganwadi jobs) పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించగా.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు (Rajasthan High court) ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అంగన్ వాడీ జాబ్స్ ఇప్పిస్తామని ఓ రాజకీయ నాయకుడు, ప్రభుత్వ మాజీ అధికారి పలువురు మహిళలను నమ్మించారు. వారికి వసతి ఏర్పాటు చేసి భోజనం పెట్టారు. అయితే ఆ భోజనంలో మత్త మందు కలిపి, నిద్రలోకి జారుకున్నాక.. ఆ మహిళలపై సామూహిక అత్యాచారం జరిపారు. వారే కాకే మిత్రులతో కూడా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పసికందును ఊయలకు బదులు ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. తరువాత ఏమైందంటే ?
వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరి లు అంగన్‌వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దాదాపు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు తనతో పాటు మరో 20 మంది మహిళలను ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రలోభపెట్టినట్లు ఆ మహిళ ఆరోపించింది.
అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మహేంద్ర మేవాడా, మహేంద్ర చౌదరిలు కలిసి 20 మంది మహిళలను నమ్మించారు. వారికి వసతి కల్పించి, భోజనంలో మత్తు మందు కలిపి ఇచ్చారు. మహిళలు మత్తులోకి జారుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి స్నేహితులతో కూడా ఈ ఘోరానికి ఒడిగట్టేలా చేశారు. ఈ దుశ్చర్యనంతా వీడియో తీశారు. ఆ వీడియోల ఆధారంగా మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ.. తమతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, రూ.5 లక్షలు తీసుకొచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక ఆ పరీక్షలు కూడా తెలుగులోనే..
వారి ఆగడాలను చాలా మంది మహిళలు భరించారు. కానీ అందులో పాలీ జిల్లాకు చెందిన మహిళ, మరి కొందరు మహిళల మద్దతుతో
పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇవన్నీ అసత్యాలన్నీ పోలీసులు వారి ఫిర్యాదును తీసుకోలేదు. దీంతో బాధితులు నేరుగా రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీంతో హైకోర్టు ఎనిమిది మంది మహిళల ఫిర్యాదు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.