Asianet News TeluguAsianet News Telugu

వలసకూలీలు వైరస్ వ్యాప్తికి దోహదం చేసే ఛాన్స్: ప్రపంచ బ్యాంక్

భారత్ లో వివిధ ప్రాంతాల నుండి స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వలసకూలీల వల్ల కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది.
 

Migrant workers returning home could spread coronavirus in sub-continet:world bank
Author
New Delhi, First Published Apr 12, 2020, 5:28 PM IST


న్యూఢిల్లీ: భారత్ లో వివిధ ప్రాంతాల నుండి స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వలసకూలీల వల్ల కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది.

వలస వెళ్లిన ప్రాంతాల్లో ఇప్పటికే వైరస్ పాకి ఉంటుందని ప్రపంచబ్యాంక్ అభిప్రాయపడింది. దక్షిణాసియాలో  రీజినల్ లో అత్యంత జనసాంద్రత కలిగిన దేశాల్లోని నగరాల్లో కరోనా సామాజిక వ్యాప్తిని అడ్డుకోవడం ఓ సవాలేనని ప్రపంచ బ్యాంక్ చెప్పింది.

also read:కరోనాను జయించిన ఆర్నెళ్ల చిన్నారి: చప్పట్లు, విజిల్స్‌తో స్వాగతం

ఇది ఈ వైరస్ ను వ్యాప్తి చేసేందుకు  ఎక్కువగా దోహదపడేదని ఆయన వరల్డ్ బ్యాంక్ తేల్చి చెప్పింది. వలసలను ఆపేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది.దక్షిణాసియాలో 65 ఏళ్ల వయస్సుపైబడిన వ్యక్తులు  చైనా, అమెరికాతో పోలిస్తే చాలా తక్కువని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.

కరోనాను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.  లాక్ డౌన్ కారణంగా  వలస కూలీలు తమ ఉపాధిని కూడ కోల్పోయారని వరల్డ్ బబ్యాంక్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. దీంతోనే వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అగ్రశ్రేణి బ్యాంక్ తేల్చి చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios