గ్వాలియర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలో బుధవారం నాడు ఉదయం మిగ్-21 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు.

 బుధవారం నాడు ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే ప్రమాదం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు పైలెట్లు విమానం నుండి సురక్షితంగా బయటపడ్డారు.

గ్రూప్ కెప్టెన్, స్క్వాడ్రన్ లీడర్ ‌లు సురక్షితంగా ఈ ప్రమాదం నుండి బయటకు వచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.