హిమాచల్ ప్రదేశ్ లో కుప్పకూలిన మిగ్-21 యుద్ద విమానం

MiG-21 fighter jet crashes in Himachal pradesh
Highlights

హిమాచల్ ప్రదేశ్ లో భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ద విమానం కుప్పకూలింది. మిగ్ 21 విమానం కంగారా జిల్లాలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే  ఇప్పటివరకు  విమాన పైలట్ ఆచూకీ మాత్రం లభించకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

ప్రమాదానికి గురైన యుద్ద విమానం పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరింది. అయితే ఇది హిమాచల్ ప్రదేశ్ లో ప్రయాణిస్తూ జవాలీ డివిజన్‌లోని పట్టా జట్టియన్ ప్రాంతంలో కూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ విమాన పైలట్ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. అతడు సురక్షితంగా బైటపడ్డాడా లేక ప్రమాదానికి గురయ్యాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.   

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఐఎఎఫ్ అధికారులు, రెస్క్యూ టీం రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై వారు ప్రాథమికంగా దర్యాప్తు చేయడంతో పాటు ఆధారాలను సేకరించనున్నారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 
loader