ఈ మధ్యకాలంలో ఇంట్లో ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు.. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. కరెంట్ మీటర్ రీడింగ్ చూడటానికి వచ్చిన ఓ విద్యుత్ ఉద్యోగి.. ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతికి ముద్దుపెట్టి పరారయ్యాడు..

తమిళనాడులోని కళిక్కుడికి చెందిన జయరామన్ అనే 42 ఏళ్ల వ్యక్తి రాష్ట్ర విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.. రోజు వారీలాగే.. బుధవారం మధ్యాహ్నం కూడా మీటర్ రీడింగ్ తీయడానికి ఓ ఇంట్లోకి వెళ్లి.. మీటర్ రీడింగ్ లెక్కకట్టి.. బిల్లు ఇవ్వడానికి ఇంటి లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి ఒంటరిగా కనిపించడంతో.. ఆమెను పిలిచి బిల్లు చేతిలో పెట్టి.. ఉన్నట్లుండి ఆమెను గట్టిగా కౌగిలించుకుని.. వెంటనే ముద్దు పెట్టాడు..

అతడి ప్రవర్తనకు భయపడిపోయిన ఆమె కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకు వచ్చారు.. జనం వస్తున్న సంగతిని పసిగట్టిన జయరామన్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.