ఏకంగా నకిలీ ఆధార్ లు తయారీ.. 8 మంది కేటుగాళ్ల అరెస్ట్ !
hyderabad: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు కేటుగాళ్లు నకిలీల దందాను నడిపిస్తున్నారు. సర్టిఫికెట్లు, బ్రాండ్లను కూడా మార్చేస్తున్నారు. దీంతో అసలు ఏదో.. నకిలీ ఏదో గుర్తించడం కాస్త కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే దొంగ సర్టిఫికేట్లతో పాటు ఏకంగా నకిలీ ఆధార్ కార్డులను సైతం తయారుచేస్తున్నఓ కేటుగాళ్ల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
hyderabad: ప్రస్తుతం మార్కెట్ లోకి ఏ కొత్త వస్తువు వచ్చిన దానికి నకిలీ వెంటనే దిగిపోతున్నది. దొంగ పత్రాలతో నకిలీ సర్టిఫికేట్టు తయారు చేయడం, వివిధ కాలేజీలు, యూనివర్సీటీల పేరుతో ఉన్న నకిలీ సర్టిఫికేట్లను డబ్బులకు విక్రయించి ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో నకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్న ఓ కేటుగాళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. వారు ఏదో డాక్యుమెంట్లో కాదు.. ఏకంగా ఆధార్ కార్డు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులతో పాటు ప్రజల్ని కూడా షాక్ కు గురిచేస్తోంది.
Also Read: మోక్షం అంటూ... మూఢత్వంతో కుటుంబాన్ని బలితీసుకున్న వ్యక్తి
ఈ కేటుగాళ్ల ముఠా బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డ్ తయారు చేస్తున్నదనీ, దీనికి సంబంధించిన పక్కా సమాచారం ఉండటంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ చెప్పారు. ముఠాకు చెందిన 8 మంది సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 6 ఆధార్ కిట్స్, స్టాంప్స్, ఆధార్ కార్డ్ ఫాంమ్స్, ఫోర్జరీ బర్త్ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్ కార్డ్ , 80 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, గోల్కొండ పోలీసులు సంయుక్తంగా కలిసి ఈ కేటుగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. నిందితులు అసోంకు చెందిన నకిలీ గుర్తింపు పత్రాలను ఆధార్ కార్డులు అప్‌డేట్ వివరాల కోసం ఉపయోగించారని పోలీసులు తెలిపారు.
Also Read: Tax raids: వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు.. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు !
ఈ నకిలీ దందాకు సంబంధించి అరెస్టయిన వారిలో బోరబండకు చెందిన టి.నితేష్ సింగ్ (30), టోలీచౌకీకి చెందిన సయ్యద్ ముస్తఫా (28), రబ్బానీ ఎంఏ (28), హకీంపేటకు చెందిన మహ్మద్.అజర్ షరీఫ్ (27), బోరబండకు చెందిన మహ్మద్.సోహైల్ (23), రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌కు చెందిన షేక్ జహంగీర్ పాషా (37), మహ్మద్ అన్వరుద్దీన్ (34), చార్మినార్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (20)లు, అసోంకు చెందిన పవన్ (35)లు ఉన్నారు. వీరిలో పలువురు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నితేష్, సయ్యద్ ముస్తఫా, జహంగీర్, అన్వరుద్దీన్ స్నేహితులు కాగా, రబ్బానీ, అజర్ షరీఫ్ సయ్యద్ ముస్తఫా ఇంటర్నెట్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.
Also Read: Coronavirus: 18 ఏండ్లలోపు వారిపై ఒమిక్రాన్ పంజా
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2017లో సయ్యద్ ముస్తఫా టోలిచౌకిలో ఆన్‌లైన్ సేవల వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే మహమ్మారి మరియు తదుపరి లాక్‌డౌన్ కారణంగా నష్టాలను ఎదుర్కొవడంతో పాటు రుణాల ఊబిలోకి జారుకున్నాడు. ఈ క్రమంలోనే సులువుగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు వెతకడం ప్రరంభించాడు. ఈ క్రమంలోనే అసోంలోని ఆధార్ సెంటర్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడు పవన్ గురించి నితీష్ ద్వారా అతనికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం గుర్తింపు పత్రాలు, నకిలీ కార్డుల తయారీ గురించి తెలుసుకున్నాడు. తాను కూడా కొందరూ స్నేహితులతో కలిసి నకిలీ సర్టిఫికేట్ల దందాకు పాల్పడుతున్నాడు. ఎనిమిది మంది సభ్యులుగా ఏర్పడి ఈ నకిలీ దందాను నడుపుతున్నారు. “అసోం గుర్తింపు పత్రాలను ఉపయోగించి మోసపూరితంగా కస్టమర్లకు ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేయాలని అనుమానితులు నిర్ణయించుకున్నారు.
రాష్ట్రాల కోసం జారీ చేసిన గుర్తింపు రుజువులను రాష్ట్రంలోనే ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఉన్నాయి. కానీ ప్రభుత్వాన్ని మోసం చేయాలనే దురుద్దేశంతో అనుమానితులు హైదరాబాద్‌లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ మరియు అప్‌డేషన్ కోసం అసోం నివాసితుల గుర్తింపు రుజువులను ఉపయోగించారు” అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఫోర్జరీ గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలతో ముఠా భారీ మోసాలకు పాల్పడుతోంది. జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లోంచి డౌన్లోడ్ చేసి సర్టిఫికెట్స్ ను ఫోర్జరీ చేస్తోందని పోలీసు కమీషనర్ చెప్పారు. ముఠా ఇప్పటివరకు 3 వేల ఆధార్ కార్డ్స్ జారీ చేసిందని... వీటిలో 100 ఫేక్ కార్డ్స్ గుర్తించామని ఆయన తెలిపారు. ఒక్కో కార్డుకు వెయ్యి నుంచి రెండు వేల రాపాయల వరకు ఈ ముఠా డబ్బులు వసూలు చేసిందని అంజనీ కుమార్ వివరించారు.
Also Read: రూ.3 వేల కోసం బండరాళ్లతో కొట్టిచంపారు.. దేశరాజధానిలో దారుణ ఘటన