మతిస్థిమితం లేని వ్యక్తి రైలు భోగీలో ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నాడని.. అతని బంధువులు కాళ్లూ, చేతులు కట్టేశారు. మెడకు తాడుకట్టి సీటు కిందికి తోశారు. 

చెన్నై : తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 25 ఏళ్ల మానసిక వ్యాధిగ్రస్తుడు బుధవారం రాత్రి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఆగిన రైలులోని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో మృతి చెంది కనిపించాడు. కంపార్ట్‌మెంట్‌లోని బెర్త్ కింద రాడ్‌కు మెడ, చేతులు, కాళ్లను కట్టివేయడంతో అతను మృతి చెందాడు. 

మృతుడిని ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని ఈరోడ్ నుండి కొచువేలి-గోరఖ్‌పూర్ రప్తి సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు బంధువులు ఇంటికి తీసుకువెళుతున్నారు. వారిద్దరు రామ్‌కుమార్ (35), 15 ఏళ్ల బాలుడు. వీరిద్దరినీ హత్య ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరులో టమాటా దొంగలు... రూ. 37వేల విలువైన 550కిలోలు చోరీ..

వీరిద్దరూ రైలు చెన్నై స్టేషన్‌కు చేరుకోగానే ప్రకాష్‌ని నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. కానీ అతను ఎంతకూ లేవకపోవడంతో చనిపోయాడని గుర్తించి, పోలీసులు తెలిపారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ప్రకాష్ కు వివాహమై ఒక బిడ్డ ఉంది. అతను తన బంధువులు, మరికొంతమందితో కలిసి ఆగస్టు 15న ఈరోడ్‌లో రాతి క్వారీలో పని చేసేందుకు వచ్చాడని పోలీసులు తెలిపారు. అయితే, అక్కడికి వచ్చిన ఒక్కరోజులోనే అతని ఆరోగ్యం క్షీణించింది. అన్యమనస్కంగా కనిపించాడు. ఇష్టం వచ్చినట్లు అటూ, ఇటూ పరిగెడుతూ కనిపించాడు. దీంతో కూలీలను పనిలో పెట్టుకున్న కాంట్రాక్టర్.. అతడిని స్వగ్రామానికి తీసుకెళ్లాలని బంధువులను కోరాడు.

ఇద్దరు బంధువులు ప్రకాష్ తల్లికి సమాచారం ఇచ్చారు. అతనిని తీసుకువస్తున్నట్లు చెప్పారు. అలా ముగ్గురు బుధవారం సాయంత్రం రప్తి సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. పోలీసుల విచారణలో ప్రకాష్ కోచ్‌లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ.. తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో ప్రయాణికులు అతనితోపాటు ఉన్న ఇద్దరు బంధువులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్‌కుమార్‌, మైనర్ బాలుడు ఎంత చెప్పినా ప్రకాష్ వినిపించుకోలేదు. ఏం చేయాలో పాలుపోని వారిద్దరూ ప్రకాశ్‌ చేతులు, కాళ్లను గుడ్డతో కట్టేశారు. 

దీంతో అతను కేకలు వేశారు. అరవకుండా అతని నోటికి, మెడకు మెడకు బట్ట కట్టేసి, సీటు కిందకు నెట్టారని కొందరు ప్రయాణికులు పోలీసులకు తెలిపారు. అయితే, ప్రకాష్ ఆ కట్టనుంచి విడిపించుకోవడానికి చాలా కష్టపడి ఉండవచ్చని, ఈ ప్రయత్నంలోనే గొంతు బిగుసుకుపోయి చనిపోయి ఉంటాడని జీపీఆర్ ఆఫీసర్ ఒకరు అన్నారు. అతని మృతికి కారణమైన ఇద్దరిలో.. రామ్‌కుమార్‌ను జైలుకు పంపగా, బాలనేరస్థుడిని ప్రభుత్వ కరెక్షనల్ కేంద్రంలో చేర్చారు.