ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 100మందిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. కాగా... చివరకు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల చేతికి చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌ వీరప్పన్‌సత్రంకు చెందిన 21 ఏళ్ల యువతి అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు కళాశాలలో 2015లో బీఎస్‌సీ టెక్నికల్‌ మొదటి ఏడాది చదువుతూ వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాధాకృష్ణ(37) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తరచూ కలుస్తూ... మంచి వ్యక్తిలా నటించి ఆమెతో మాటలు కలిపేవాడు. 

తర్వాత రాధాకృష్ణన్‌ ఒకరోజు తన పుట్టినరోజు జరుపుకోనున్నట్లు తెలిపి విద్యార్థినికి కారులో సేలం తీసుకువెళ్లాడు. కారులో వెళుతుండగా ఆమెకు లైంగిక వేధింపులు జరిపి దాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. తర్వాత వీడియోను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తానని బెదిరించి ఆమెపై పలుసార్లు లైంగిక దాడి జరిపాడు.

 దీంతో ఆమె గర్భం దాల్చగా ఆమెకు తాళి కట్టి ఈరోడ్‌లోని ఒక ఆస్పత్రికి తీసుకువెళ్లి అబార్షన్‌ జరిపించాడు. అంతేగాకుండా ఆమెను తన స్నేహితులతో వ్యభిచారం చేయించేందుకు ఒత్తిడి తెచ్చాడు. దీనిపై బాధితురాలు ఈరోడ్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రియల్‌ ఎస్టేట్‌ యజమాని రాధాకృష్ణన్‌ను శనివారం రాత్రి అరెస్టు చేసి విచారణ జరిపారు. 

విచారణలో అతడు దాదాపు 100 మంది కళాశాల విద్యార్థినులపై లైంగిక దాడులు జరిపినట్లు తెలిసింది. రాధాకృష్ణన్‌ సెల్‌ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా 600 నెంబర్లు నమోదు చేసి ఉన్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.