అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఇండియా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ వేసుకొన్న డ్రెస్ గురించే అంతా చర్చించుకొంటున్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని ఈ డ్రెస్ ను తయారు చేయించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణితో కలిసి సోమవారం నాడు ఇండియా పర్యటనకు వచ్చాడు. మెలానియా ట్రంప్  వైట్ ఔట్ ఫిట్ లో భారత పర్యటనకు వచ్చారు. ఆమె తన నడుముకు ఆకుపచ్చ బంగారు రంగుతో ఉన్న వస్త్రాన్ని కట్టుకొన్నారు. మెలానియా ట్రంప్ మోడల్. తాను ధరించే దుస్తుల విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకొంటుంది.

also read:తాజ్ మహల్‌ను సందర్శించిన ట్రంప్ దంపతులు

తన దుస్తులను ఎంపిక చేసుకొంటుంది. 20వ శతాబ్దానికి చెందిన భారతీయ వస్త్రధారణకు సంబంధించిన వాటి ఆధారంగా ఈ డ్రెస్ ను రూపొందించారు. మెలానియా ట్రంప్ కు ఈ డ్రెస్ ను డిజైనర్ పియరీ తయారు చేశారు.గతంలో అమెరికా ప్రథమ మహిళలు లారా బుష్, హిల్లరీ క్లింటన్, మెషెల్ ఒబామాలకు సైతం పియరీ దుస్తులను రూపొందించారు.

ప్యారిస్ లోని తన స్నేహితుల ద్వారా ఈ వస్త్రాన్ని సేకరించినట్టుగా హెర్వ్ ప్రకటించారు. ఈ వస్త్రంలోని అంచు భాగం అత్యంత అరుదైందని కూడ హెర్వ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ప్రకటించారు.