న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో అమెరికా అధ్యక్షుడు సతీమణి  మెలానియా ట్రంప్  మంగళవారం నాడు సందర్శించారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో హ్యాపినెస్ క్లాసులను ఆమె పరిశీలించారు.

హైద్రాబాద్‌ హౌస్ లో భారత ప్రధానితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో  మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌కు వచ్చారు.

స్కూల్ లో మెలానియా ట్రంప్ కు  విద్యార్ధిని విద్యార్ధులు ఘనంగా స్వాగతం పలికారు. మెలానియా ట్రంప్ కు  సంప్రదాయ పద్దతిలో  విద్యార్థులు స్వాగతం పలికారు.  మెలానియాకు బొట్టు పెట్టి హరతి ఇచ్చి చిన్నారులు స్వాగతం పలికారు. మెలానియా ట్రంప్ ఈ స్కూల్‌ సందర్శనను పురస్కరించుకొని  విద్యార్థులు రంగు రంగుల దుస్తులను ధరించారు. 

Also read:హైద్రాబాద్‌ హౌస్‌లో ట్రంప్, మోడీ భేటీ: రెండు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల ఒప్పందాలు

ఢిల్లీలోని సర్వోదయస్కూల్ హ్యాపీనెస్ క్లాసులను మెలానియా ట్రంప్ పరిశీలించారు. క్లాసులో  టీచర్ల బోధనను మెలానియా పరిశీలించారు. చిన్నారులు తమ అభిరుచులను టీచర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.పాటలు, సంగీతం, ఆటలపై తమకు ఉన్న మక్కువ గురించి విద్యార్థులు చెప్పారు.  టీచర్ల విద్యాబోధనను మెలానియా ట్రంప్  ఆసక్తిగా పరిశీలించారు.

 ఈ స్కూల్‌లో మెలానియా ట్రంప్ టూర్‌కు సంబంధించి ఢిల్లీ సీఎం కానీ, విద్యా శాఖ మంత్రికి గానీ ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదని  అమెరికా కోరింది.