Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌ హౌస్‌లో ట్రంప్, మోడీ భేటీ: రెండు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల ఒప్పందాలు

అమెరికా , ఇండియా మధ్య సుమారు 300 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. హైద్రాబాద్ హౌస్ లో ట్రంప్, మోడీ మంగళవారం నాడు భేటీ అయ్యారు. 

Trumps reach Hyderabad House for talks with PM Modi
Author
New Delhi, First Published Feb 25, 2020, 11:42 AM IST

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైద్రాబాద్‌ హౌస్ కు చేరుకొన్నారు. రాజ్‌ఘాట్ నుండి ట్రంప్ దంపతులు నేరుగా హైద్రాబాద్ హౌస్ కు వచ్చారు.  రెండు దేశాల  మధ్య  పలు అంశాలపై మోడీ, ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయి.

రెండు దేశాల మధ్య  అవగాహనకొచ్చిన రక్షణ, ఆంతరంగిక భద్రత ఒప్పందాలపై మంగళవారం లాంఛనంగా సంతకాలు చేయనున్నారు. రెండు దేశాల మధ్య సుమారు రూ. 300 కోట్ల మేర ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని చెబుతున్నారు.  హెలికాప్టర్ల కొనుగోలు కోసం రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సోమవారం నాడు మొతేరా స్టేడియంలో ట్రంప్ ప్రకటించారు.
 
24ఎంహెచ్-60 ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లు, 6ఏ హెచ్-64 ఈ అపాచీ హెలికాప్టర్ల కోనుగోలు విషయంలో రెందు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.  
10 హై అల్టిట్యూట్ లాంగ్ ఎండ్యూరన్స్ (హేల్) డ్రోన్ల కొనుగోలు విషయమై మోడీ, ట్రంప్ చర్చించనున్నారు. సాయుధ డ్రోన్లు, ఢిల్లీ రక్షణకు ఎయిర్ డిఫెన్స్ సిస్టం కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. 

 ఎంకే -45 127 ఎంఎం నావల్ గన్స్, 6పీ-81 లాంగ్ మారిటైం ప్యాట్రోల్ ఎయిర్ క్రాప్టులు కొనుగోలు విషయంలో రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది
సువిశాల సముద్ర తీర భద్రతకు ఎంక్యూ-9 రీపర్ ,ప్రిడేటర్ - బి హేల్ డ్రోన్లు అవసరం ఉందని భారత రక్షణశాఖ భావిస్తోంది. యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ కోసం పీ-81 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు  చేయాలని ఇండియా భావిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios