మేఘాలయ, నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మేఘాలయాలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా 59 స్థానాలకు, నాగాలాంగ్ లో 60 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 2వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు.
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు ఈ ఓటింగ్ ముగియనుంది. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. మేఘాలయ, నాగాలాండ్ ప్రజలు ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారు రికార్డు సంఖ్యలో పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.
మేఘాలయలో అధికార కాన్రాడ్ సంగ్మాకు చెందిన ఎన్పీపీ అధికారాన్నితిరిగి నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నాయి. నాగాలాండ్ లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి రెండోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. అయితే అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేని కాంగ్రెస్ 23 మంది అభ్యర్థులను రంగంలోకి దించింది.
పదో తరగతి విద్యార్థిని పరీక్ష రాయడం కోసం గ్రీన్ కారిడార్.. ఎక్కడంటే..
మేఘాలయ ఎన్నికలు..
మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 59 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 69 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని మొత్తం 21.6 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. సోహియాంగ్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది.
గత ఐదేళ్లుగా అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ మాజీ మిత్రపక్షం బీజేపీ, ప్రతిపక్ష టీఎంసీ, ఇతర ప్రాంతీయ పార్టీలపై ఒంటరిగా పోటీ చేస్తోంది. దక్షిణ తురా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా మిలిటెంట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బెర్నార్డ్ మరక్ పై పోటీ చేస్తున్నారు. విపక్ష నేత, టీఎంసీ నేత ముకుల్ సంగ్మా సోంగ్సాక్, తిక్రికిల్లా అనే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి డీడీ శిరా, సోదరుడి భార్య కూడా ఎన్నికల రేసులో ఉన్నారు.
నాగాలాండ్ ఎన్నికలు..
నాగాలాండ్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అకులుటో నుంచి బీజేపీ అభ్యర్థి కజెటో కినిమి ఏకగ్రీవంగా గెలిచారు. అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)తో కలిసి బీజేపీ 20 : 40 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటుపై పోటీ చేస్తోంది. ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నెఫియు రియో ఉన్నారు.
కేరళ లో చైల్డ్ పోర్నోగ్రఫీపై కొరఢా.. 858 ప్రదేశాల్లో దాడులు..
2003 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 23 మంది అభ్యర్థులను నిలబెట్టగా.. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) 22 స్థానాల్లో పోటీ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 26 స్థానాలు గెలుచుకున్న ఎన్పీఎఫ్ 22 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా.. వారిలో ఒకరు వైదొలగడంతో 21 మంది పోటీలో ఉన్నారు.
