సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజేఐ వెంకట్రామయ్య కూతురు బివి నాగరత్న తొలి సీజేఐగా అయ్యే అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానానికి జడ్జిలుగా 9 మంది పేర్లను కొలిజియం మంగళవారం నాడు సిఫారసు చేసింది. అన్ని అనుకొన్నట్టుగా జరిగితే 2027లో నాగరత్న సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేకపోలేదు. 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9మంది పేర్లను కొలిజియం సిఫారసు చేసింది. కొలిజియం సిఫారసు చేసిన 9 మంది జడ్జిల్లో ముగ్గురు మహిళా జడ్జిలు కూడ ఉన్నారు.

కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నబీవీ నాగరత్నకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియామకమయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆమె సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జిగా చరిత్ర సృష్టించనున్నారు. 2027లో ఆమె సీజేఐగా నియామకం అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆ సమయానికి ఆమె పదవికాలం నెల రోజులు మాత్రమే ఉండనుంది.

also read:సుప్రీంకోర్టుకు: ముగ్గురు మహిళా జడ్జిలు సహా 9 మంది పేర్లు సిఫారసు చేసిన కొలిజియం

రెండేళ్ల సుదీర్ఘ విరామానికి పుల్‌స్టాప్ పెడుతూ 9 మంది పేర్లను సుప్రీంకోర్టు జడ్జిలుగా నియామకం కోసం కొలిజియం సిఫారసు చేసింది. జస్టిస్ నారిమన్ రిటైర్ కావడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 25కి తగ్గింది. ఈ 9 మంది నియామకానికి ఆమోదం లభిస్తే సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 34కి పెరగనుంది.2019 మార్చి 19 తర్వాత అప్పటి సీజేఐ రంజన్ గొగొయ్ రిటైర్ తర్వాత కూడ కొత్త జడ్జిల నియామకం జరగలేదు.

ప్రస్తుతం 9 మంది పేర్లలో ముగ్గురు మహిళా జడ్జిల పేర్లను కొలిజియం సూచించింది. కర్ణాటక హైకోర్టు జడ్జి బి.వి .నాగరత్న, తెలంగాణహైకోక్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లను కొలిజియం సిఫారసు చేసింది.

జస్టిస్ నాగరత్న 2008లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియామకమయ్యారు. రెండేళ్ల తర్వాత ఆమె పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు. ఆమె తండ్రి ఈఎస్ వెంకట్రామయ్య కూడ గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 1989 జూన్ 1989 డిసెంబర్ మధ్యలో ఆయన సీజేఐగా పనిచేశారు. ఒకవేళ ఆమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియామకం జరిగితే తండ్రి అడుగుజాడల్లో నడుస్తుదందనే అభిప్రాయాలున్నాయి.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఉన్నారు. ఆమె 2022లో రిటైర్ కానున్నారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు 8 మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే నియమించారు.