ముగ్గురు మహిళల న్యాయమూర్తులు సహా 9 మంది పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం కొలిజియం సిఫారసు చేసింది.. సీజేఐ ఎన్వీరమణ నేతృత్వంలో కొలిజియం సమావేశమై ఈ నిర్ణయం తీసుకొంది. 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం 9 మంది జడ్జిల పేర్లను కొలిజియం మంగళవారం నాడు రాష్ట్రపతికి సిఫారసు చేసింది.ఈ 9 మంది పేర్లలో ముగ్గురు మహిళా జడ్జిలు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలిజియం సమావేశమై తొమ్మిదిమంది జడ్జిల పేర్లను సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియామకం కోసం సిఫారసు చేసింది.

ముగ్గురు మహిళా న్యాయమూర్తుల పేర్లను కొలిజియం సిఫారసు చేసింది. కర్ణాటక హైకోర్టు జడ్జి బి.వి .నాగరత్న, తెలంగాణహైకోక్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లను కొలిజియం సిఫారసు చేసింది. భవిష్యత్తులో జస్టిస్ నాగరత్న సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావచ్చనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

న్యాయమూర్తులు జస్టిస్ ఒకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరిలు కూడ కొలిజియానికి ఎంపికయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఒకా సీనియర్. పౌరుల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పులు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్దిని పొందాయి. కరోనా సమయంలో ఆయన ఇచ్చిన తీర్పులు చర్చకు తీశాయి.

వలస కార్మికుల హక్కులను రక్షించేందుకు గాను ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పులు సంచలనం కల్గించాయి. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నాథ్ కరోనా సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు లేకపోవడం మందుల లభ్యత వంటి సమస్యలపై ప్రశ్నించారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మహేశ్వరీ గత ఏడాది డిసెంబర్ లో సిక్కింకి బదిలీ అయ్యారు. జస్టిస్ సిటి రవికుమార్ కేరళ హైకోర్టు రెండో సీనియర్ న్యాయమూర్తి, జస్టిస్ ఎంఎం సుందరేశ్ మద్రాస్ హైకోర్టు మూడో సీనియర్ న్యాయమూర్తి.

బార్ అసోసియేషన్ నుండి మాజీ అదనపు సోలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ సుప్రీంకోర్టుకు కొలిజియం ఎంపికచేసింది. సీనియర్ న్యాయవాది రామజన్మభూమి కేసుతో సహా అనేక ముఖ్యమైన కేసుల్లో ఆయన పాల్గొన్నారు.ఈ 9 మంది నియామకానికి ఆమోదం లభిస్తే ఉన్నత న్యాయస్థానంలో జడ్జిల సంఖ్య 33కి పెరుగుతోంది.