కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ ఇతరత్రా వ్యాధుల బారినపడి ఆర్ధికంగా కుదేలైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఔషధాల ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా క్యాన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల నివారణకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి
కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ ఇతరత్రా వ్యాధుల బారినపడి ఆర్ధికంగా కుదేలైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఔషధాల ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా క్యాన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల నివారణకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ అత్యవసర ఔషధాల జాబితా(ఎన్‌ఎల్ఈఎం)ను కేంద్ర వైద్యారోగ్య శాఖ సవరించింది. ఈ లిస్టులో చేర్చిన మందుల ధరలను జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ(ఎన్‌పీపీఏ) నిర్ణయించనుంది.
Also Read:నకిలీ వ్యాక్సిన్లపై తస్మాత్ జాగ్రత్త!.. గుర్తించడానికి సూచికలు విడుదల చేసిన కేంద్రం
జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలోకి 39 ఔషధాలను చేర్చడంతో పాటు.. మరో 16 ఔషధాలను ఆ లిస్టును తొలగించాలని కేంద్రం ప్రతిపాదించనుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గేందుకు ఉపయోగించే ఔషధాలు తొలగించే లిస్టులో ఉన్నాయని సమాచారం. వివిధ రకాల కారణాల వల్ల వీటిని ఎన్‌ఎల్ఈఎం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
