Asianet News TeluguAsianet News Telugu

నీట్ ఎగ్జామ్ రాకెట్‌ నడిపిస్తున్న మెడికల్ కాలేజీ విద్యార్థి అరెస్ట్

మెడికల్ కాలేజీ విద్యార్థి సంజూ యాదవ్‌ను అరెస్టు చేసిన ఒక నెల తర్వాత ఇప్పుడు ఈ రాకెట్ నడుపుతున్న మరో విద్యార్థి అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు.

medical college student who was running the NEET exam racket was arrested - bsb
Author
First Published Jul 5, 2023, 8:00 AM IST

న్యూఢిల్లీ : నేషనల్‌ ఎలజబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)లో రిగ్గింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మెడికల్‌ కాలేజీ విద్యార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అదే కాలేజీకి చెందిన మరో విద్యార్థి సంజూ యాదవ్‌ను నెలక్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థి స్థానంలో సంజూయాదవ్ నీట్ అభ్యర్థిగా హాజరయ్యాడు. దీంతో దొరికి పోవడంతో అరెస్ట్ చేశారు. అతడిని అరెస్టు చేసిన ఒక నెల తర్వాత మరో అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు.

మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ సమయంలో అసలు అభ్యర్థికి బదులు సంజూ యాదవ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. బయోమెట్రిక్‌ సరిపోలకపోవడంతో యాదవ్‌ను అనుమానంతో అరెస్టు చేశారు. తనిఖీ చేయగా అతని ఐడి కార్డు, ఆధార్ కార్డుతో సహా అధికారిక పత్రాలు కూడా నకిలీవని తేలిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌

విచారణ సందర్భంగా, కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్ణోయ్, భారీ మొత్తంలో డబ్బు ఆశచూపి.. వేరొకరికి బదులుగా మెడికల్ ప్రవేశ పరీక్షలో తాను పరీక్ష రాసేలా ఒప్పించాడని.. యాదవ్ వెల్లడించినట్లు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిష్ణోయ్ ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 6 లక్షలు తీసుకున్నాడు. అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios