కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రెస్ మీట్‌ను మీడియా ప్రతినిధులు బాయ్‌కాట్ చేశారు. ప్రెస్ మీట్ కోసం నిర్దేశించిన సమయాని కంటే డీకే శివకుమార్ గంట ఆలస్యంగా వచ్చారు. ఆయన కోసం ఎదురుచూసిన మీడియా ప్రతినిధులు విసుగెత్తి ఈ నిర్ణయం తీసుకున్నారు.
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఉన్న ఉద్ధండ నేతల్లో డీకే శివకుమార్ ఒకరు. ఆపత్కాలంలో పార్టీని ఆదుకుని సమస్యలను సాల్వ్ చేసే నేతగానూ ఆయనకు పేరున్నది. సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్‌కు రాష్ట్రంలో పరాభవం ఎదురైనట్టు తెలుస్తున్నది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఆయన చెప్పిన సమయానికి గంట ఆలస్యంగా వెళ్లారు. దీంతో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కవరేజ్ చేయరాదని స్థానిక మీడియా బాయ్‌కాట్ చేసింది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యతో ఆయన ప్రెస్ మీట్‌కు గంట ఆలస్యంగా వచ్చినట్టు తెలిసింది.
అయితే, ఈ ఆలస్యంతో మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. దీంతో ఆయన కోసం ఎదురుచూసిన మీడియా ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్‌నే కవర్ చేయవద్దనే నిర్ణయానికి వచ్చారు.
మీడియా ప్రతినిధులు బాయ్‌కాట్ చేసిన తర్వాత కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ ఇలా వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రతీది అనుకున్న సమయంలోనే జరగదు. మామూలు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఎప్పుడు పిలవాలో తెలుసు.. అదే ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అయితే కూడా ఎప్పుడూ పిలవాలో తెలుసు. ఎప్పుడు పిలిస్తే మీరు ఏ సమయానికి వస్తారో కూడా తెలుసు. నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూడొద్దు’ అని మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు.
Also Read: Liquor Policy Case: సీబీఐ చార్జిషీట్‌లో తొలిసారి మనీష్ సిసోడియా పేరు
ఆ తర్వాత మీడియా కోఆర్డినేటర్‌ను పిలిచి ఆ జర్నలిస్టుల నెంబర్లు ఇవ్వాలని అడిగారు. వారి మేనేజ్‌మెంట్‌కు ఫోన్ చేసి మాట్లాడతానని అంటున్న వ్యాఖ్యలు ఓ వీడియోలో వినిపించాయి.
