మెరీనాలో స్థలం ఇవ్వాల్సిందే..వైగో డిమాండ్.. పరిస్థితి ఉద్రిక్తం

mdmk vaiko Demands Marina Beach burial for Karunanidhi
Highlights

కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరిపేందుకు ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో తమిళనాడులో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్థలం కేటాయించాల్సిందేనని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎండీఎంకే నేత వైగో ప్రభుత్వాన్ని హెచ్చరించారు

కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరిపేందుకు ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో తమిళనాడులో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్థలం కేటాయించాల్సిందేనని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎండీఎంకే నేత వైగో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అంతకు ముందు నుంచి గరంగరంగా ఉన్న డీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆయన నుంచి ఈ ప్రకటన వచ్చిన కొద్దినిమిషాల్లోనే ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగారు.. కొన్ని ప్రాంతాల్లో వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది.

మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు స్థలం కేటాయించాలంటూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై రాత్రి 10.30 గంటలకు విచారణ జరగనుంది. 
 

loader