Asianet News TeluguAsianet News Telugu

మ్యాథ్స్ టీచర్ కోసం ఆ స్కూల్ ఇచ్చిన యాడ్ ఇదీ.. ఫోన్ నెంబర్ ప్లేస్‌లో ఈక్వేషన్.. నెట్టింట్లో పోస్టు వైరల్

మ్యాథ్స్ టీచర్ కోసం ఓ స్కూల్ యాజమాన్యం విడుదల చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాథ్స్ టీచర్ కావాలని, ఈ నెంబర్ కాల్ చేయాలని పేర్కొని అందులో మొబైల్ నెంబర్ ఇవ్వలేదు. దానికి బదులు ఓ పెద్ద ఈక్వేషన్ పెట్టారు. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఫోన్ చేయాల్సిన మొబైల్ నెంబర్ వస్తుంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

maths teacher recruitment ad going viral as it doesnot contain mobile number instead an equation
Author
First Published Jan 23, 2023, 4:12 PM IST

న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలకు యాజమాన్యాలు సృజనాత్మక పద్ధతులను అవలంభిస్తున్నాయి. ఉద్యోగం కోసం విడుదల చేసిన ప్రకటనలోనూ కొత్త పోకడలకు పోతున్నాయి. గుజరాత్‌లోని ఓ స్కూల్ మ్యాథ్స్ టీచర్ కోసం ప్రచురించిన ఓ ప్రకటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. నాలుగంటే నాలుగే లైన్‌లతో ఆ యాడ్ ఉన్నది. అందులో ఫోన్ నెంబర్ మాత్రం లేదు. ఫోన్ నెంబర్ స్థానంలోనే ఓ మ్యాథ్స్ ఈక్వేషన్ పెట్టారు. అంటే.. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఫోన్ నెంబర్ వస్తుంది. అంటే.. లెక్కల టీచర్ కోసం ఆ స్కూల్‌కు ఫోన్ చేయాలనుకునే వ్యక్తి కనీసం ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలని యాడ్ ద్వారా ఓ పరీక్ష పెట్టేసింది. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ యాడ్‌ను బిజినెస్ టైకూన్ హర్ష గొయెంకా ట్వీట్ చేశారు. ఈ యాడ్ చూశా అంటూ స్మైల్ ఎమోజీ క్యాప్షన్ పెట్టారు. శనివారం సాయంత్రం ఈ యాడ్ పోస్టు చేయగా.. ఇంతలోనే 1.8 మిలియన్ల మంది వీక్షించారు. సుమారు 21 వేల మంది లైక్‌లు వచ్చాయి. మ్యాథ్స్ టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం యాజమాన్యం ఉపయోగించిన ఈ టెక్నిక్ పై నెటిజన్లు మనసుపారేసుకున్నారు. 

Also Read: గోధుమ పిండి కోసం ప్రాణాలు పణంగా పెట్టి ట్రక్కును చేజ్ చేసిన ప్రజలు.. ‘15 కిలోల పిండికి రూ. 2050’ (వీడియో)

ఈ పోస్టుపై యూజర్లు తమ కామెంట్లతో స్పందించారు. ఒకరైతే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఆన్సర్ ‘9428163811’ అని పేర్కొన్నారు. ఇదే ఫోన్ చేయాల్సిన 10 డిజిట్ మొబైల్ నెంబర్ అని తెలిపారు. ఇది తనకు తాను స్వయంగా ఎలాంటి కాలిక్యులేటర్ లేకుండా.. ఏ ఇతర సహాయం లేకుండా సాల్వ్ చేశానని వివరించారు. ఈ ట్వీట్ చూడగానే స్వల్ప సమయంలోనే సాల్వ్ చేశానని తెలిపారు. కాబట్టి, తనకు ప్రైజ్ మనీతో అవార్డ్ చేయండి సార్ అంటూ కామెంట్ చేశారు.

మరొకరు జోక్ చేస్తూ.. ఈ ఈక్వేషన్ చూస్తే చాలా మంది తాను చేయబోయేది వేరే స్కూల్‌కే అయి ఉంటుందనే అవకాశాలే ఎక్కువ అని కామెంట్ చేశారు. ఇంకొకరు ఒక వేళ ఈ ఈక్వేషన్ ఒక స్టూడెంట్ సాల్వ్ చేస్తే అతడికి మ్యాథ్స్ టీచర్ అవసరం లేదన్నట్టేనా? అని సందేహం వెలిబుచ్చారు. స్మార్ట్ యాజమాన్యం.. స్మార్ట్ ఉద్యోగిని ఎంచుకుంటుందని తెలిపారు.  ఆ స్కూల్ బహుశా రామానుజన్, శాకుంతలా దేవీని వెతుకున్నదేమో అని మరో యూజర్ కామెంట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios