Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్ లో భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత.. ఏకేఎస్ 74 రైఫిళ్లు, చైనీస్ పిస్టల్స్ స్వాధీనం

జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ చేపట్టిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు పట్టుబడ్డాయి. బారాముల్లా జిల్లాలోని ఉరీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఏకేఎస్ 74 రైఫిళ్లు, చైనీస్ పిస్టల్స్ వంటివి ఉన్నాయి. 

Massive seizure of weapons in Jammu and Kashmir. AKS 74 rifles, Chinese pistols seized
Author
First Published Dec 25, 2022, 5:04 PM IST

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరీ ప్రాంతంలో భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. యుద్ధ తరహాలో స్వాధీనం చేసుకున్న స్టోర్లలో 24 మ్యాగజైన్‌లతో కూడిన ఎనిమిది ఏకేఎస్ 74 రైఫిళ్లు, 560 లైవ్ రైఫిల్ రౌండ్లు, 24 మ్యాగజైన్‌లతో కూడిన 12 చైనీస్ పిస్టల్స్, 224 లైవ్ పిస్టల్స్ రౌండ్‌లు, 14 పాకిస్థాన్, చైనా గ్రెనేడ్‌లతో పాటు పాకిస్థాన్ జెండాతో కూడిన 81 బెలూన్‌లు స్వాధీనం చేసుకుట్టు కల్నల్ మనీష్ పంజ్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కి ఆదివారం తెలిపారు.

‘జై శ్రీరామ్’ అంటూ బీజేపీ భయాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

ఈ విషయాన్ని బారాముల్లా పోలీసులు కూడా ట్వీట్ ద్వారా తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. రికవరీపై కల్నల్ మనీష్ పుంజ్ మాట్లాడుతూ.. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీలోని హత్‌లంగా సెక్టార్‌లోని సాధారణ ప్రాంతంలో ఆర్మీతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోదాలు చేపట్టి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్త బృందం ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సహచరులను ఈ వారం ప్రారంభంలో పట్టుకున్నాయి. నిందితులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు లాజిస్టికల్ మద్దతు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించారని ఆరోపణలు ఉన్నాయి. నిందితుల్లో నలుగురిని అబ్ రౌఫ్ మాలిక్, అల్తాఫ్ అహ్మద్ పేయర్, రియాజ్ అహ్మద్ లోన్, అబ్ మజీద్ బేగ్‌లుగా గుర్తించారు. బందిపొరాకు చెందిన మరో నిందితుడిని కూడా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి.

క్రాల్‌పోరా ప్రాంతంలో పనిచేస్తున్న అబ్‌ రౌఫ్‌ మాలిక్‌, అల్తాఫ్‌ అహ్మద్‌ పేయర్‌, రియాజ్‌ అహ్మద్‌ లోన్‌లను విచారించగా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదుల కోసం నిర్మించిన రెండు రహస్య స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. అయితే కక్రూసా కుప్వారాకు చెందిన నదీమ్ ఉస్మాని అలియాస్ పాకిస్థాన్ ఉగ్రవాద హ్యాండ్లర్ ఫరూక్ అహ్మద్ పీర్ సూచనల మేరకు ఈ రహస్య స్థావరాలు నిర్మించబడ్డాయని తెలిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios