Asianet News TeluguAsianet News Telugu

యమునా నది ఒడ్డున భారీగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం

యమున నది తీరాన.. మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో కార్చిచ్చుగా భావించారు

Massive fire engulfs Yamuna River basin near Rajghat ksp
Author
New Delhi, First Published Feb 24, 2021, 9:52 PM IST

యమున నది తీరాన.. మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు.

అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో కార్చిచ్చుగా భావించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుంది. యమున నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

ఈ సమీపంలోనే మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ ఉంది. దీనిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

అయితే దట్టమైన పొగలు రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటికే కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధానిలో ఈ పొగ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి వుంది.

కాగా  మంటలు వ్యాపించిన ప్రాంతానికి సమీపంలోనే ఇందిరా గాంధీ స్టేడియం, రాజ్‌ఘాట్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఉంది. అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios