Asianet News TeluguAsianet News Telugu

వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేయండి సర్.. ఓ భార్య లేఖ..!

ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా చేసిన ట్వీట్‌.. ఈ నివేదికల్లో ఉన్నది వాస్తవమే అని అర్థం అవుతుంది.

Marriage Will End If WFH Continues: Woman's Hilarious SOS To Harsh Goenka
Author
Hyderabad, First Published Sep 13, 2021, 1:13 PM IST

కరోనా కారణంగా..గతేడాది మార్చి నుంచి ఆఫీసులన్నీ మూతపడిపోయాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించేశాయి. ఇప్పటికీ.. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. 

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీలకు, ఉద్యోగులకు ఎలాంటి ప్లస్ పాయింట్లు, లాభాలు ఉన్నాయో తెలీదు కానీ, వర్క్‌ ఫ్రం హోం వల్ల ఇళ్లల్లో ఆడవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి చాకిరి మరింత పెరిగింది. ఈ మేరకు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా చేసిన ట్వీట్‌.. ఈ నివేదికల్లో ఉన్నది వాస్తవమే అని అర్థం అవుతుంది.

ఓ మహిళ తన భర్త కంపెనీకి రాసిన లెటర్‌ని గోయెంకా ట్వీట్‌ చేశాడు. దీనిలో సదరు మహిళ నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం చాలు.. ఇక ఆఫీసుకు పిలవండి అని కోరుతూ యాజమాన్యానికి లేఖ రాసింది. ఇంకొద్ది రోజులు వర్క్‌ ఫ్రం హోం ఇలానే కొనసాగితే.. మా వైవాహిక బంధం ముగుస్తుందని తెలపడం గమనార్హం.

‘‘సార్‌ నేను మీ కంపెనీలో పని చేసే మనోజ్‌ అనే ఉద్యోగి భార్యను. నేను మీకు సవినయంగా విన్నవించుకుంటుంది ఒక్కటే. నా భర్తకు ఆఫీస్‌కు వచ్చి పనిచేసే అవకాశం ఇవ్వండి. అతను ఇప్పటికే టీకా రెండు డోసులు వేసుకున్నాడు. అన్ని కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తాడు. దయచేసి అతడిని ఆఫీస్‌కు రమ్మనండి. మీరు ఇలానే మరి కొన్నాళ్లు నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం ఇస్తే.. మా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే వర్క్‌ ఫ్రం హోం మొదలైన నాటి నుంచి నాకు పని భారం పెరిగింది. నా భర్త రోజుకు పది సార్లు కాఫీ తాగుతాడు.. ఒక్క గదిలో కూర్చుని పని చేయడు. వేర్వురు గదల్లో కూర్చుంటాడు. పైగా అక్కడంతా చెత్తా చెదారం పడేస్తాడు. ఇక రోజుకు ఎన్నిసార్లు తింటున్నాడో లెక్కేలేదు. వర్క్‌ కాల్స్‌ సమయంలో కునికిపాట్లు పడుతుంటాడు’’ అని తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

అంతేకాదు ‘‘ఇప్పటికే నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారి బాగోగులు చూడ్డానికే సమయం సరిపోవడం లేదు. వారికి తోడు ఇప్పుడు నా భర్త వచ్చి చేరాడు. ఇంతమందికి సేవ చేయడం నా వల్ల కాదు. దయచేసి పెద్ద మనసుతో నా ఇబ్బందిని అర్థం చేసుకుని.. నా భర్తను ఆఫీస్‌కు పిలిచి.. నాకు కొంత విశ్రాంతి ఇవ్వండి’’ అని కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios