ఇదెక్కడి వింతరా బాబు... రోడ్డుకు పెళ్ళా ..! 

గ్రామస్తులంతా కలిసి రోడ్డుకు పెళ్లిచేసిన వింత ఘటన కేరళలో వెలుగుచూసింది. భాజా భజంత్రీలు, పసందైన వంటకాలతో విందు, అతిథుల మధ్య ఈ రోడ్డు వివాహ వేడుక జరిగింది. 

Marriage to Road in Kerala AKP

కేరళ : అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించాలని అనుకుంటే పెళ్లి చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. ఇటీవల అమ్మాయిలను అమ్మాయిలు, అబ్బాయిలను అబ్బాయిలే పెళ్లి చేసుకుంటున్న వింత ఘటనలు చూస్తున్నాం. జాతకం కుదరడంలేదని చెట్లు, జంతువులతో పెళ్లి, వర్షాలు పడటంలేదని కప్పల పెళ్ళీ జరగడం చూసాం... కానీ ఓ రోడ్డుకు పెళ్ళి చేయడం మీరెప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? అయితే ఈ వింత పెళ్లి వేడుక గురించి తెలుసుకోండి. 

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో కొడియత్తూరు గ్రామంలో ఓ రోడ్డు విస్తరణకు గ్రామస్తులు సిద్దమయ్యారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసిన రోడ్డు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ కారణంగా బాగా ఇరుకుగా మారింది. ఈ రోడ్డు రాకపోకలు బాగా ఇబ్బందిగా మారడంతో స్వయంగా గ్రామస్తులే తమ సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం సరికొత్త వేడుకను నిర్వహించి రోడ్డు విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టారు. 

రోడ్డు విస్తరణకు దాదాపు రూ.60 లక్షల వరకు ఖర్చు అవుతుందని కొడియాత్తూరు గ్రామస్తులు అంచనా వేసారు. ఈ నిధుల కోసం రోడ్డుకు ఘనంగా పెళ్ళి చేసారు. బాజా భజంత్రీలతో అట్టహాసంగా ఈ రోడ్డు పెళ్లి వేడుకను నిర్వహించారు. అతిథులకు రకారకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసారు. ఇలా రోడ్డుకు పెళ్లిచేసి వచ్చిన అతిథుల నుండి విరాళాలు సేకరించారు.  

Also Read  వస్త్రధారణ సాకుతో రైతుకు నో ఎంట్రీ .. భగ్గుమన్న నెటిజన్లు, బెంగళూరు మెట్రో అధికారి సస్పెన్షన్

ఎవరికోసమో ఎదురుచూడకుండా తమ సమస్యను తామే పరిష్కరించుకునేందుకు కేరళ గ్రామస్తులు చేపట్టిన రోడ్డు పెళ్లి వేడుక అందరినీ ఆకట్టుకుంది. ఈ  పెళ్లి గురించి తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేసినా... దాని వెనకాల దాగివున్న మంచిపని అందరినీ కదిలిస్తోంది. ఇలా కొడియత్తూరు గ్రామంలో జరిగిన రోడ్డు పెళ్లి వ్యవహారం సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. నిధుల సేకరణ కోసం తెలివిగా ఆలోచించిన గ్రామస్తులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios