Asianet News TeluguAsianet News Telugu

వస్త్రధారణ సాకుతో రైతుకు నో ఎంట్రీ .. భగ్గుమన్న నెటిజన్లు, బెంగళూరు మెట్రో అధికారి సస్పెన్షన్

బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) వివాదంలో చిక్కుకుంది. మెట్రోలో సెక్యూరిటీ సూపర్‌వైజర్..తన వస్త్రధారణ కారణంగా రైతును అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఆయనను విధుల్లోంచి సస్పెండ్ చేశారు.

Bengaluru: BMRCL official suspended for denying entry to farmer based on attire ksp
Author
First Published Feb 26, 2024, 1:22 PM IST

బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) వివాదంలో చిక్కుకుంది. మెట్రోలో సెక్యూరిటీ సూపర్‌వైజర్..తన వస్త్రధారణ కారణంగా రైతును అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఆయనను విధుల్లోంచి సస్పెండ్ చేశారు. రైతుకు ప్రవేశం నిరాకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఈ ఘటనను ఖండించడంతో పాటు బెంగళూరు మెట్రోను ట్రోల్ చేశారు. 

ఇటీవల ఒక రైతు, తన సాంప్రదాయ దుస్తులు ధరించి మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు .. సెక్యూరిటీ సూపర్‌వైజర్ గేటు వద్ద ఆపివేయడంతో ఈ ఘటన జరిగింది. చెల్లుబాటయ్యే టికెట్ ఉన్నప్పటికీ, కేవలం దుస్తుల కారణంగా రైతును లోపలికి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు వెంటనే ఎక్స్ వేదికగా #BengaluruMetroOnlyforVIP హ్యాష్‌ట్యాగ్‌తో విరుచుకుపడ్డారు. రైతును అవమానించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరు మెట్రో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు. 

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో బీఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌ వేగంగా స్పందించారు. ఘటనలో ప్రమేయం వున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రైతుకు అన్యాయంగా ప్రవేశం నిరాకరించడంపై వచ్చిన నిరసనకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ ప్రయాణికులందరూ వారి వస్త్రధారణతో సంబంధం లేకుండా న్యాయంగా, గౌరవప్రదంగా వుండేలా చూసుకోవడం అత్యవసరం ’’ అని బీఎంఆర్‌సీఎల్ ఎండీ పేర్కొన్నారు. మెట్రో ప్రయాణం కోసం నిర్దిష్ట దుస్తులను తప్పనిసరి చేసే నియమం ఏదీ లేదని, వేషధారణ ఆధారంగా ప్రవేశాన్ని తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదన్నారు. 

భద్రతా పర్యవేక్షకుడిపై తీసుకున్న చర్యలు ఆ తరహా ఘటనలను మేము పరిష్కరించే తీవ్రతను ప్రతిబింబిస్తాయని బీఎంఆర్‌సీఎల్ ఎండీ తెలిపారు. ప్రయాణీకులందరికీ వారి నేపథ్యం లేదా వస్త్రధారణతో సంబంధం లేకుండా స్వాగతించే వాతావరణాన్ని సృష్టించడానికి తాము కట్టుబడి వున్నామని ఆయన స్పష్టం చేశారు. సస్పెన్షన్ తర్వాత రైతు మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించడానికి అనుమతించారు. ప్రతి ఒక్కరికి దుస్తుల ఎంపిక ఆధారంగా వివక్షను ఎదుర్కోకుండా ప్రజా రవాణాను యాక్సెస్ చేసే హక్కు వుందని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios