ఒక పెళ్లి కార్యరూపం దాల్చడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోతుంటాయి.. అమ్మాయి, అబ్బాయిల ప్రేమలు బయటపడటమో లేదంటే ఇరు కుటుంబాల గత చరిత్ర, కట్నాలు, కానుకలు ఇలా ఎన్నో అవాంతరాలు.. అయితే పెళ్లి కొడుకు భయపడ్డాడని పీటల మీద పెళ్లి ఆగిపోవడం ఎక్కడైనా విన్నారా..? బిహార్‌లోని సర్నా జిల్లాలో ఇద్దరు యువతి యువకులకు పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిశ్చియ తాంబూలాలు అందుకుని.. పెళ్లి వేడుకు ఘనంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

తీరా పెళ్లిరోజు రానే వచ్చింది. పీటల మీద ఉండగా.. పిడుగు పడింది.. అంతే వరుడు అదిరిపడ్డాడు.. అంతేకాకుండా విచిత్రంగా ప్రవర్తించడంతో.. తాను ఈ పెళ్లి చేసుకోవడం లేదని అందరికి చెప్పింది వధువు. అయితే వధువు పెళ్లి వద్దన్నందుకు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వరుడి కుటుంబసభ్యులకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.