Maoists: వారం రోజుల తర్వాత సబ్ ఇంజనీర్‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు
బస్తర్ రీజియన్‌లో నిర్మాణంలో ఉన్న ఓ రోడ్డును సర్వే చేస్తూ సబ్ ఇంజనీర్ అజయ్ లక్రా మావోయిస్టులకు పట్టుబడ్డాడు. ఆయనతోపాటు ఓ ప్యూన్ కూడా మావోయిస్టులకు చిక్కారు. ప్యూన్‌ను రెండు రోజుల తర్వాత విడిచిపెట్టినా, సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను మాత్రం వారం తర్వాత బుధవారం మధ్యాహ్నం ఓ రోడ్డుపై వదిలిపెట్టారు. ఈ సందర్భంలో అజయ్ లక్రా సతీమణి కూడా ఉన్నారు.
బీజాపూర్: Maoistలు బుధవారం దాదాపు వారం రోజుల తర్వాత Bijapur సబ్ ఇంజనీర్‌ను విడిచిపెట్టారు. వారం రోజుల క్రితం Sub Engineer, ఓ ప్యూన్‌ను మావోయిస్టులు పట్టుకున్నారు. మావోయిస్టు ప్రభావిత బీజాపూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ రోడ్డును సర్వే చేస్తుండగా వీరిద్దరినీ వారు పట్టుకెళ్లిపోయారు. సుమారు వారం రోజుల తర్వాత సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను వదిలిపెట్టారు. ప్యూన్ లక్ష్మణ్ పర్తగిరిని ముందుగానే రిలీజ్ చేశారు.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద సబ్ ఇంజనీర్ అజయ్ లక్రా పనిచేస్తున్నారు. Chhattisgarh బస్తర్ రీజియన్‌లోని బీజాపూర్‌లో ప్రస్తుతం పని చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్మాణంలో ఉన్న ఓ రోడ్డు సర్వే చేయడం మొదలుపెట్టాడు. ప్యూన్ లక్ష్మణ్ పర్తగిరితో కలిసి రోడ్డు సర్వే చేస్తూ అడవి లోపలకు కొంత దూరం వెళ్లాడు. దీంతో మావోయిస్టులు వారిని అక్కడే పట్టేసుకున్నారు. నవంబర్ 11వ తేదీన వీరు సర్వే చేస్తూ మళ్లీ సాయంత్రానికి తిరిగి రాలేదు. గోర్నా-మాంకేలి మధ్య 15 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు.
Also Read: మావోయిస్ట్ నేత ఆర్కే జీవిత చరిత్ర ముద్రణ.. ముసారాంబాగ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌పై పోలీసుల దాడులు
11వ తేదీన వీరిద్దరూ తిరిగి రాకపోవడంతో బీజాపూర్ జిల్లా హెడ్‌క్వార్టర్ తర్వాతి రోజే గాలింపులు మొదలు పెట్టింది. చివరికి వారు కన్హయగూడ గ్రామం దగ్గర సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను, ప్యూన్ లక్ష్మన్ పర్తగిరిని నక్సల్స్ పట్టుకున్నారని పోలీసులు ధ్రువీకరిలంచారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత ప్యూన్‌ను రెండు రోజులకే వదిలిపెట్టారు. కానీ, సబ్ ఇంజనీర్‌ను మాత్రం విడిచి పెట్టలేదు.
సబ్ ఇంజనీర్‌ను విడుదల చేయాలని పాత్రికేయులు, సామాజిక సంఘాలు మావోయిస్టులను కోరుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జన్ అదాలత్ నిర్వహించిన తర్వాత సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను మావోయిస్టులు విడిచిపెట్టారని ఓ సీనియర్ పోలీసు అధికారి వివరించారు. గంగ్లూర్ రోడ్డు దగ్గర ఈ రోజు మధ్యాహ్నం సబ్ ఇంజనీర్ అజయ్ లక్రానును విడిచి పెట్టినట్టు తెలిపారు. అజయ్ లక్రాను విడుదల చేసినప్పుడు ఆయన సతీమణి అర్పితా లక్రా కూడా అక్కడే ఉన్నారని వివరించారు.
Also Read: ఎన్‌కౌంటర్ బూటకం.. తగిన మూల్యం చెల్లించాల్సిందే: గడ్చిరోలి ఎదురుకాల్పులపై మావోల స్పందన
అయితే, అజయ్ లక్రాను మావోయిస్టులు చితకబాదారా? లేదా ఏవైనా బెదిరింపులు చేశారా? అనే విషయంపై ఇప్పటికి స్పష్టత లేదు. అజయ్ లక్రా జిల్లా హెడ్‌క్వార్టర్ చేరగానే మెడికల్ చెకప్‌కు పంపిస్తామని తెలిపారు.
ఇటీవలే మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు చావు దెబ్బ తగిలింది. గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, టాప్ లీడర్ మిలింద్ తేల్‌తుంబ్డే సహా 26 మంది నక్సల్స్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.