Asianet News TeluguAsianet News Telugu

మావోయిస్ట్ నేత ఆర్కే జీవిత చరిత్ర ముద్రణ.. ముసారాంబాగ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌పై పోలీసుల దాడులు

హైదరాబాద్ (hyderabad police) ముసారాంబాగ్‌లోని (moosarambagh) ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో (printing press) శుక్రవారం  పోలీసులు సోదాలు నిర్వహించారు. నిషేధిత మావోయిస్ట్ సాహిత్యం ముద్రిస్తున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు.

hyderabad police raids on printing press in moosarambagh
Author
Hyderabad, First Published Nov 12, 2021, 7:29 PM IST

హైదరాబాద్ (hyderabad police) ముసారాంబాగ్‌లోని (moosarambagh) ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో (printing press) శుక్రవారం  పోలీసులు సోదాలు నిర్వహించారు. నిషేధిత మావోయిస్ట్ సాహిత్యం ముద్రిస్తున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఇటీవల మరణించిన మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తనిఖీల సందర్భంగా భారీగా మావోయిస్టుల సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. 

మరోవైపు దుమ్మగూడెం కేసులో (dummugudem case) ఎన్ఐఏ (national investigation agency) చార్జీషీట్ దాఖలు చేసింది. ఏడుగురు మావోయిస్టు నేతల పేర్లను ఎన్ఐఏ ఛార్జ్ షీట్‌లో చేర్చింది. ముత్తు నాగరాజు, కొమ్మరజు కనక్కయ్య, సారయ్య, హిడ్మా, సాంబయ్య, మడకం కోసి, వల్లేపు స్వామి పేర్లను ఛార్జ్ షీటులో చేర్చింది ఎన్ఐఏ. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ ఆధారంగా మే 2న కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మావోలు కుట్రపన్నినట్లుగా దర్యాప్తులో తేలింది. మావోయిస్టుల నుంచి 500 కేజీల బూస్టర్లు, 400 జెలిటన్ స్టిక్స్, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాన్ సఫలం కోసం హిడ్మా భారీగా నిధులు సమకూర్చాడు. అటవీ అధికారులు పేరుతో వాహనాల్లో పేలుడు సామాగ్రిని తరలించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హిడ్మా సహా ఇతర అగ్రనేతలకు ఆయుధాలను తరలించారు. 

Also Read:బీజాపూర్ : మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

కాగా.. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్ (akkiraju haragopal)గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14వ తేదీన ఆర్‌కె మరణించినట్టుగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు. ఆర్కేకు కిడ్నీలు ఫెయిల్ కావడంతో మరణించినట్టుగా అభయ్ తెలిపారు. Maoist party పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కేకు అంత్యక్రియలను నిర్వహించినట్టుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి Abhay ప్రకటించారు. కిడ్నీలు పాడు కావడంతో ఆర్‌కెకు చికిత్స కూడా అందించామని అయితే ఆయనను కాపాడుకోలేకపోయామన్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం ఆరు గంటల సమయంలో ఆర్‌కె మరణించినట్టుగా ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

1958 గుంటూరు (guntur) జిల్లా పల్నాడు (palnadu) ప్రాంతంలో రామకృష్ణ జన్మించారు. మాచర్లలో డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికట్ స్టూడెంట్స్ యూనియన్ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నాడు.1980లో తొలిసారిగా ఆయన పీపుల్స్ వార్ (peoples war group) కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 1982లో పీపుల్స్‌వార్ లో హోల్ టైమర్ గా చేరాడు. దీంతో ఆర్‌కె  అడవుల్లోకి వెళ్లిపోయారు. నల్లమల అటవీ ప్రాంతంలో పార్టీ విస్తరణకు పనిచేశారు. ఆ తర్వాత ఆయన గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 1996 నుండి 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 2008 నుండి 2016 వరకు ఏవోబీ కార్యదర్శిగా పనిచేశారు.  ఆ తర్వాత ఆయన  కేంద్రకమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. మావోయిస్టు కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించారు. దీంతో ఉన్న కొద్ది మంది నేతల రక్షణ కోసం పార్టీ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని అడవుల్లోకి రావాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios