బందీగా వున్న జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేశారు మావోయిస్టులు. ఛత్తీస్‌గఢ్‌లోని తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జవాన్‌ను వదిలిపెట్టారు. బసగూడ అడవుల్లో వందల మంది గ్రామస్తుల రాకేశ్వర్‌ను విడిచిపెట్టారు. 

బందీగా వున్న జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేశారు మావోయిస్టులు. ఛత్తీస్‌గఢ్‌లోని తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జవాన్‌ను వదిలిపెట్టారు. బసగూడ అడవుల్లో వందల మంది గ్రామస్తుల రాకేశ్వర్‌ను విడిచిపెట్టారు.

ఆయన విడుదలతో రాకేశ్వర్ కుటుంబం సంబరాలు చేసుకుంది. జవాన్ తల్లి, భార్య, కుమార్తె ఉద్వేగానికి గురయ్యారు. జవాన్ విడుదల కోసం 11 మంది మధ్యవర్తుల బృందం ప్రయత్నాలు చేసింది. ఈ బృందంలో ఏడుగురు జర్నలిస్టులు కూడా వున్నారు. వారితో చర్చల తర్వాత జవాన్‌ను విడుదల చేయడానికి మావోలు అంగీకరించారు. 

ఈ నెల 3వ తేదీన బీజాపూర్‌లో జరిగిన మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో సుమారు 24 మంది జవాన్లు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ సమయంలో కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు తమ బందీగా ఉంచుకొన్నారు.

Also Read:మా నాన్నను వదిలేయండి: మావోలకు రాకేశ్వర్ సింగ్ కూతురు వేడుకోలు

రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగానే ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ఫోటోను కూడ విడుదల చేశారు.రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగానే ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ఫోటోను కూడ విడుదల చేశారు.

ఈ విషయమై మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేయాలని ఆయన కూతురు ఏడుస్తూ మావోలను కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఐదు రోజుల పాటు మావోయిస్టుల చెరతో జవాన్ రాకేశ్వర్ సింగ్ ఉన్నారు