Asianet News TeluguAsianet News Telugu

మావోయిస్టుల కాల్పులు.. ఇద్దరు జేజేఎఫ్ జవాన్లు మృతి

జార్ఖండ్ లో దారుణం జరిగింది. మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పులతో ఇద్దరు జవాన్లు మరణించారు. వీరు జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్ కు చెందారు.

Maoist firing.. Two JJF jawans killed.. Incident in Jharkhand..ISR
Author
First Published Aug 15, 2023, 11:36 AM IST

మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో జేజేఎఫ్ (జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్)కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని టోంటో ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. మావోయిస్టుల దాడిలో అమిత్ తివారీ, గౌతమ్ కుమార్ అనే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు పశ్చిమ సింగ్ భూమ్ ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు.

తాగేందుకు డబ్బులివ్వలేదని 19 ఏళ్ల భార్యను హతమార్చిన భర్త.. ఎక్కడంటే ?

ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. జార్ఖండ్ లోని లతేహర్ జిల్లాలో శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతపై కాల్పులు జరిగాయి. బాధితుడిని జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సాహుగా గుర్తించారు. సాహు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  బలుమత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డూన్ స్కూల్ సమీపంలో సాయంత్రం 6 గంటల సమయంలో మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సాహుపై కాల్పులు జరిపారు. దాడి చేసిన వారిని ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios