మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని ఆ తాగుబోతు తన భార్యను కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన భర్త.. తన భార్యను దారుణంగా హతమార్చాడు.

మద్యం ఎన్నో అనర్థాలకు కారణం అవుతోంది. తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. తన, మన అనే బేధాలు మరిచి హత్యలకు, అత్యాచారాలకు కూడా పాల్పడేవారు మరి కొందరు. తాజాగా తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ఓ భర్త భార్య దగ్గరకు వెళ్లి, మళ్లీ తాగేందుకు డబ్బులివ్వాలని కోరాడు. ఆమె దానికి నిరాకరించడంతో దారుణంగా హతమార్చాడు. 

ఒంటరిగా ఉంటున్న దళిత వివాహితపై గ్యాంగ్ రేప్.. వైసీపీ నాయకుల దారుణం ?

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని వాలాజాబాద్ కు చెందిన పురుషోత్తమన్ నాలుగేళ్ల కిందట తన మేనకోడలైన మునియమ్మను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమెకు 19 సంవత్సరాలు కాగా.. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు. స్థానికంగా దొరికే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

కొంత కాలం నుంచి పురుషోత్తమన్ తాగుడుకు బానిస అయ్యాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తరచూ భార్యను వేధించేవాడు. ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా అతడు తాగి ఇంటికి వచ్చాడు. తనకు మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య మునియమ్మను కోరాడు. తరచూ ఇలాగే జరుగుతుండటంతో ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. డబ్బులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది.

అమ్మఒడి సొమ్ము రావడం లేదని వెళ్తే.. వేలిముద్ర వేసుకొని డబ్బులు కాజేసిన వాలంటీర్..

దీంతో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. క్షణాల్లోనే ఈ గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన పురుషోత్తమన్.. వంటగదిలోకి వెళ్లి, కత్తిని తీసుకొచ్చి భార్యను పొడిచారు. దీంతో అక్కడే కుప్పకూలి మునియమ్మ చనిపోయింది. అనంతరం ఏడాది వయస్సున్న కూతురును తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ స్థానికులు అతడిని చుట్టుముట్టారు. పారిపోకుండా పట్టుకొని, పోలీసులకు అప్పగించారు.

నిజామాబాద్ లో బీజేపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన వినయ్ కుమార్ రెడ్డి.. ఎంపీ అర్వింద్ తో విబేధాలే కారణం ?

తరువాత పోలీసులు ఆ ఇంటి తలపులు పగులొట్టారు. ఇంట్లో పడి ఉన్న మునియమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాంచీపురం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. నిందితుడిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తరువాత రిమాండ్ కు తీసుకెళ్లారు.