చనిపోతూ కూడా విధులు నిర్వర్తించాడు దూరదర్శన్ కెమెరామన్. నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా అరుణ్‌పూర్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలను కవర్ చేసేందుకు దూరదర్శన్ ప్రతినిధుల బృందం అక్కడ మకాం వేసింది.

ఈ క్రమంలో భద్రతా సిబ్బందితో పాటు వ్యానులో వెళుతుండగా మాటు వేసిన మావోలు వీరిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు భద్రతా సిబ్బందితో పాటు డీడీ కెమెరామన్ అచ్యుతానంద్ దుర్మరణం పాలయ్యారు.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తన మాతృమూర్తికి కన్నీటి వీడ్కోలు చెబుతూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తన ఎదురుగా మృత్యువు ఉందని.. తాను పైకి లేవలేకపోతున్నానని.. మావోలతో ఏడుగురు జవాన్లు పోరాడుతున్నట్లు అయినప్పటకీ తనకు భయం లేదని తెలిపాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృత్తిపట్ల నిబద్ధత, కన్నతల్లిపై ఉన్న ప్రేమ, అప్యాయత ఆయన కళ్లలో కనిపిస్తోందంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మావోల మెరుపుదాడి.. ఇద్దరు జవాన్లు, డీడీ కెమెరామన్ మృతి