Asianet News TeluguAsianet News Telugu

అంత పదవీ వ్యామోహమా, సీఎం సాబ్ గిమ్మిక్కులు: పారికర్ పై విపక్షాల సెటైర్లు

గోవా సీఎం మనోహర్ పారికర్ పై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తోంది. కాలేయ వ్యాధితో బాధపడుతూ ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి బాధ్యతలు నిర్వహిస్తోన్న మనోహర్‌ పారికర్‌ ముక్కులో ట్యూబ్ తియ్యకుండానే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంపై మండిపడుతోంది.  

manohar parrikar trolled inspected construction bridge mandovi river
Author
Panaji, First Published Dec 17, 2018, 1:16 PM IST

పణాజి : గోవా సీఎం మనోహర్ పారికర్ పై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తోంది. కాలేయ వ్యాధితో బాధపడుతూ ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి బాధ్యతలు నిర్వహిస్తోన్న మనోహర్‌ పారికర్‌ ముక్కులో ట్యూబ్ తియ్యకుండానే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంపై మండిపడుతోంది.  

మరీ అంత పదవి వ్యామోహం అవసరమా అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న పారికర్‌ అక్టోబర్‌లో డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న పారికర్‌ ఆదివారం తొలిసారి ప్రజల మధ్యకు వచ్చారు. అధికారులతో కలిసి పణాజీలోని మండోవి నదిపై నిర్మిస్తోన్న వంతెన పనులను పరిశీలించారు.

బీజేపీ అధికార దాహానికి నిలువెత్తు నిదర్శనం మనోహర్ పారికర్ వ్యవహరించిన తీరేనని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఓమర్ అబ్ధుల్లా ఘాటుగా విమర్శించారు. ఎంత అమానుషం,పూర్తిగా కోలుకొని మనిషిని బాధ్యతలు నిర్వహించమని, ఫోటోలకు ఫోజులివ్వమని ఒత్తిడి చేయడం దారుణమంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అటు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది సైతం సీఎంపై సెటైర్లు వేశారు. సీఎం ముక్కులో ట్యూబ్‌ ఉందా? పదవి దాహంతో ఉన్న పార్టీ ఓ వ్యక్తి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాధ్యతలు నిర్వహించమని కోరుతుందా? కానీ అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఏమైనా చేయగలదు. సీఎం సాబ్‌ జాగ్రత్త.. ఇక మీ పార్టీ గిమ్మిక్కులు కొనసాగవు’ అంటూ ట్వీట్‌ చేశారు.

విపక్షాలు అధికార వ్యామోహం అంటూ విమర్శలు చేస్తుంటే బీజేపీ మాత్రం మనోహర్ పారికర్ పై ప్రసంశల జల్లు కురిపిస్తోంది. బీజేపీ మహిళా మోర్చా సీనియర్‌ నాయకురాలు ప్రీతి గాంధీ నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం పారికర్‌ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios