పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం నాడు జరిగాయి.

మీరామర్ బీచ్‌లో పారికర్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ఆదివారం రాత్రి పారికర్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. పారికర్  మృతదేహం వద్ద ప్రధానమంత్రి మోడీ సోమవారం నాడు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు.

మనోహర్ పారికర్ అంత్యక్రియల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రియతమ నేతకు కన్నీటితో వీడ్కోలు పలికారు.పలు పార్టీల నేతలు కూడ పారికర్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

గోవా సీఎం పారికర్ కన్నుమూత