పనాజీ: గోవా సీఎం మనోహార్ పారికర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

గోవా రాష్ట్రానికి పారికర్ మూడు దఫాలు పనిచేశారు. కొంత కాలంగా పారికర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కొన్నాళ్ల క్రితం పారికర్ అమెరికాలో చికిత్స తీసుకొన్నాడు.1994లో పారికర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోవాలోని మపుసాలో పారికర్ జన్మించారు.2000లో గోవా సీఎంగా తొలిసారిగా పారికర్ బాధ్యతలు చేపట్టారు.. గోవాకు పారికర్ నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు.

మోడీ కేబినెట్ లో పారికర్ రక్షణ మంత్రిగా పనిచేశారు.2017 మార్చి 14వ తేదీ నుండి పారికర్ గోవాకు సీఎంగా కొనసాగుతున్నారు.ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పారికర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. గోవా సీఎంగా, మోడీ కేబినెట్ లో కీలకమైన రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. ముంబై ఐఐటీ పూర్తి చేశారు పారికర్.రాజకీయాల్లో అత్యంత నీతివంతమైన నేతగా పారికర్ కు పేరుంది.

గత వారం రోజులుగా పారికర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇవాళ పారికర్ బీపీ పడిపోయినట్టుగా సమాచారం.కొంతకాలంగా పారికర్ క్లోమ గ్రంధి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.పారికర్ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్  సంతాపం తెలిపారు.