Asianet News TeluguAsianet News Telugu

పారికర్ ఔట్.. గోవాకి కొత్త సీఎం..?

దీంతో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు బీజేపీ కేంద్ర పరిపాలక బృందం ఒకటి గోవాకి చేరుకుంది.
 

Manohar Parrikar ill, BJP moves to get new CM in Goa
Author
Hyderabad, First Published Sep 17, 2018, 10:37 AM IST

గోవాకి త్వరలో కొత్త సీఎం రానున్నారా..? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. దీంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు బీజేపీ కేంద్ర పరిపాలక బృందం ఒకటి గోవాకి చేరుకుంది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్‌ సంతోష్, రామ్‌ లాల్, రాష్ట్ర ఇన్‌చార్జి విజయ్‌ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌ టెండూల్కర్‌ తెలిపారు.

40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్‌కు 16, ఎన్‌సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్‌ కార్యదర్శి చెల్లకుమార్‌ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios