న్యూఢిల్లీ: దేశీయ ఉత్పత్తులను  కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. పండుగల సమయంలో దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని ప్రోత్సహించాలని ఆయన తెలిపారు.

ఆదివారం నాడు మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రసంగించారు.దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ శత్రువుల బారి నుండి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయంలో మరోసారి గుర్తు చేసుకోవాలని ఆయన కోరారు.

పండుగల సమయంలో తమ కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో కాపలా ఉంటున్న సైనికులను గుర్తు చేసుకోవాలని  ప్రధాని కోరారు.పండుగ రోజున సైనికులను స్మరిస్తూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు.

also read:బీహార్ లో ఎన్డీయేదే అధికారం: ఎన్నికల సభలో మోడీ

కరోనా సమయంలో  పండుగలు జరుపుకొనే సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాని సూచించారు.కరోనా పోరులో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

దేశానికి అవసరమయ్యే పెన్సిల్ కలపలో 90 శాతం కాశ్మీర్ లోయ నుండి సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.