మన్ కీ బాత్  100వ ఎపిసోడ్ లో  ప్రధాని నరేంద్ర మోడీ  ఇవాళ ప్రసంగించారు.  పలు సమస్యలకు  ఈ  కార్యక్రమం వేదికగా మారిందని  మోడీ  పేర్కొన్నారు.   


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారంనాడు 100వ ఎపిసోడ్ కు చేరుకుంది. . ప్రతి నెలా చివరి ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగిస్తున్నారు. 2014 అక్టోబర్ 3 నుండి మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ పాల్గొంటున్నారు. మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

99వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ఈ ఏడాది మార్చి 26న ప్రసారమైంది. అవయవదానం, మహిళా శక్తి గురించి ఈ ఎపిసోడ్ లో మోడీ ప్రస్తావించారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ నిర్మాతలను మోడీ అభినందించారు. ఇవాళ వంద ఎపిసోడ్ లో మోడీ ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు వీక్షించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు ఆయా ప్రాంతాల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. 


ప్రతి ఎసిపోడ్ ప్రత్యేకంగా ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు. బన్ కీ బాత్ ప్రారంభించి ఇన్నేళ్లు కావస్తున్నా తాను నమ్మలేకపోతున్నట్టుగా మోడీ చెప్పారు. ప్రతి ఎపిసోడ్ దేనికదే ప్రత్యేకంగా ఉందని మోడీ వివరించారు. కుమార్తెతో సెల్ఫీ కార్యక్రమాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. స్వచ్ఛ భారత్ , ఖాదీ, అజాదీ కా అమృత్ మహోత్సవాలు ప్రజా ఉద్యమాలుగా మారాయని మోడీ గుర్తు చేశారు. 

అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై మన్ కీ బాత్ లో చర్చించినట్టుగా మోడీ చెప్పారు. మన్ కీ బబాత్ కార్యక్రమం సామాన్యుల సమస్యల పరిష్కారానికి వేదికగా మారిందని మోడీ చెప్పారు. సామాన్యులతో అనుసంధానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రజల భావోద్వేగాలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నానని మోడీ గుర్తు చేసుకున్నారు. తన ఆలోచనలను కూడా ప్రజలతో పంచుకున్నట్టుగా మోడీ ప్రస్తావించారు.

 సామాన్యులకు సంబంధించి ప్రతి నెలా తాను కొన్ని వేల సందేశాలు చదివినట్టు మోడీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలకు తనను మరింత చేరువ చేసింందన్నారు. అసామాన్యుల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నట్టుగా మోడీ గుర్తు చేసుకున్నారు. చెట్లు నాటడం, పేదలకు వైద్యం అందించడం ప్రేరణ కలిగించాయన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని హర్యానా నుండి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హర్యానాలో స్త్రీ, పురుష నిష్పతి గురించి నిత్యం చర్చలు జరిగేవన్నారు. సెల్ఫీ విత్ డాటర్ ప్రారంభించిన సునీల్ తో ప్రధాని మోడీ మాట్లాడారు.

మట్టి గ్లాసులు తయారు చేస్తున్న మహిళా సంఘాల గురించి మన్ కీ బాత్ లో మోడీ చెప్పారు. దేశీయ వస్తువులను వాడుతున్న విశాఖ నగరానికి చెందిన వ్యక్తి వెంకట మురళి ప్రసాద్ గురించి మోడీ ప్రస్తావించారు. పర్యావరణ హిత ఉత్పత్తులు తయారు చేస్తున్న మణిపూర్ కు చెందిన విజయశాంతితో మోడీ మాట్లాడారు. దేశంలో పర్యావరణ రంగం వేగంగా అభివృద్ది చెందుంతుందని మోడీ చెప్పారు.

 నదుల, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. విదేశాలకు వెళ్లే ముందు దేశశ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ఆయన సూచించారు. దేశంలో కనీసం 15 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రధాని మోడీ కోరారు. టెక్నాలజీని జోడించి విద్యా వ్యస్థలో మార్పులు తెచ్చినట్టుగా మోడీ చెప్పారు. సమిష్టి కృషితో సమూల మార్పులు తీసుకువస్తామని మోడీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.