లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బ్యాంకు లాకర్లను సీబీఐ అధికారులు మంగళవారం నాడు తనిఖీ చేశారు. బ్యాంకు లాకర్లలో ఏమీ దొరకలేదని సిసోడియా చెప్పారు

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లను సీబీఐ అధికారులు మంగళవారం నాడు పరిశీలించారు. ఘజియాబాద్ లోని మనీష్ సిసోడియా బ్యాంకు కాతాలను సీబీఐ అధికారులు ఇవాళ పరిశీలించారు.
 తన నివాసంలో, బ్యాంకు ఖాతాల్లో ఏమీ లభ్యం కాలేదని సిసోడియా చెప్పారు.ఘజియాబాద్ లో సీబీఐ అధికారులు తన బ్యాంకు ఖాతాలను పరిశీలించిన తర్వాత సిసోడియా మీడియాతో మాట్లాడారు. తన బ్యాంక్ లాకర్లో రూ. 70 వేల విలువైన నగలున్నాయన్నారు. సీబీఐ నిర్వహించిన సోదాల్లో ఏమీ లభ్యం కాలేదని ఆయన చెప్పారు. నాకు నా కుటుంబానికి క్లీన్ చిట్ దక్కిందదని మనీష్ సిసోడియా చెప్పారు.

సోదాల సమయంలో సీబీఐ అధికారులు మర్యాదగానే వ్యవహరించారన్నారు. తన నివాసంలో సోదాలు చేసే సమయంలో ఏదో ఒకటి వెతకాలని ప్రధాని సీబీఐ అధికారులపై ఒత్తిడి తెచ్చారని మనీష్ సిసోడియా ఆరోపించారు.

తన బ్యాంకు లాకర్ లో కూడా ఎలాంటివి లభ్యం కావని నిన్ననే మనీష్ సిసోడియా చెప్పారు. ఈ నెల 19న సీబీఐ అధికారులు తన ఇంట్లో 14 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీబీఐ విచారణకు స్వాగతం పలుకుతున్నట్టుగా సిసోడియా నిన్న ట్విట్టర్ వేదికగా ఆహ్వానం పలికారు. సీబీఐ విచారణకు స్వాగతం పలుకుతున్నట్టుగా చెప్పారు.

ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన ఎక్సైజ్ పాలసీపై ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ విషయమై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 15 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాాల్ అనుమతి లేకుండానే కొత్త లిక్కర్ విధానాన్ని తీసుకు వచ్చారని సీబీఐ వాదిస్తుంది. మద్యం దుకాణాల లైసెన్స్ ల మంజూరు చేసేందుకు లంచాలు తీసుకుందని సీబీఐ ఆరోపించింది. గత ఏడాది నవంబర్ మాసంలో ఈ పాలసీని ప్రవేశ పెట్టారు. అయితే ఎనిమిది నెలల తర్వాత అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ పాలసీని వెనక్కు తీసుకున్నారు.

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అన్నా హాజారే లేఖ

ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను ఆప్ తోసిపుచచింది. అరవింద్ కేజ్రీవాల్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే మద్యం పాలసీపై ఆరోపణలు చేస్తున్నారని సిసోడియా బీజేపీపై విమర్శలు చేశారు.ప్రజలకు కేజ్రీవాల్ మరింత చేరువ అవుతుండడమే బీజేపీ భయానికి కారణమని సిసోడియా చెప్పారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ పరయత్నాలు చేస్తుందని ఆప్ ఆరోపించింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు.