ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేగింది. మంత్రి పదవులకు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేశారు. 

ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేశారు. అలాగే మరో మంత్రి సత్యేంద్ర జైన్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో వీరిద్దరి రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. మనీలాండరింగ్ వ్యవహారంలో గత కొన్ని నెలలుగా జైలులో వున్నారు సత్యేంద్ర జైన్. ఇద్దరు ఆప్ మంత్రుల రాజీనామాతో ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేగింది. 

అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ మనీష్ సిసోడియా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. నేరుగా సుప్రీం కోర్టుకు వచ్చే ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దీనిపై అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ.. జర్నలిస్ట్ వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు తీర్పును సింఘ్వీ ఉదహరించారు. అదే మనీష్ సిసోడియా నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి కారణమని చెప్పారు. ఈ క్రమంలోనే సీబీఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3:50 గంటలకు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ తెలిపారు.

ALso REad: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు చుక్కెదురు, జోక్యం చేసుకోలేం : తేల్చేసిన సుప్రీంకోర్ట్

ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోడియాది కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సిసోడియాను ఫిబ్రవరి 26వ తేదీన మరోసారి విచారించిన సీబీఐ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను సోమవారం సీబీఐ అధికారులు.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆయనను ఐదు రోజుల పాటు రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా ప్రణాళిక బద్దంగా, రహస్యంగా కుట్ర పొందాని సీబీఐ కోర్టులో వాదనలు వినిపిచింది. ఇందులో మనీష్ సిసోడియాది కీలక పాత్ర అని కూడా తెలిపింది. ఈ కేసులో సమర్థవంతమైన విచారణ కోసం మనీష్ సిసోడియా కస్టడీ అవసరమని వాదించింది. ఈ కేసులో తన పాత్ర ఏమీ లేదని సిసోడియా పేర్కొన్నప్పటికీ.. ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని విచారణలో తేలిందని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.