Manipur violence: కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లోని కార్గిల్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, చైనా స్పష్టంగా భారతదేశ భూమిని ఆక్ర‌మించిన‌ప్ప‌టికీ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష సమావేశంలో దానిని ఖండించడం విచారకరమని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదన్న ప్రధాని మోడీ వాదనలో నిజం లేదని రాహుల్ గాంధీ అన్నారు. చైనా సైన్యం తమ భూభాగంలోకి ప్రవేశించిందని స్థానిక ప్రజలు ధృవీకరించారని ఆయన అన్నారు. 

Congress leader Rahul Gandhi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈశాన్య భార‌త రాష్ట్రమైన మ‌ణిపూర్ అంశాన్నిలేవ‌నెత్తిన ఆయ‌న‌.. అక్క‌డి దారుణ ప‌రిస్థితుల‌కు బీజేపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మంటూ విమ‌ర్శించారు. చైనా భార‌త భూభాగాన్ని ఆక్ర‌మించింద‌ని కూడా పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌భుత్వం త‌ప్పుడు స‌మాచారం ఇస్తోంద‌న్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లోని కార్గిల్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, చైనా స్పష్టంగా భారతదేశ భూమిని ఆక్ర‌మించిన‌ప్ప‌టికీ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష సమావేశంలో దానిని ఖండించడం విచారకరమని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదన్న ప్రధాని మోడీ వాదనలో నిజం లేదని రాహుల్ గాంధీ అన్నారు. చైనా సైన్యం తమ భూభాగంలోకి ప్రవేశించిందని స్థానిక ప్రజలు ధృవీకరించారని ఆయన అన్నారు. అలాగే, దేశంలో ముస్లింలు, మణిపూర్ ప్రజలపై దాడి జరుగుతోందని పేర్కొంటూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మైనారిటీలు, పేదలను దెబ్బతీసే విధానాలు, చర్యలను ప్ర‌స్తావిస్తూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాహుల్ మండిపడ్డారు. భారతదేశాన్ని అన్ని వర్గాల కోసం ఒక న్యాయమైన-సమ్మిళిత ప్రదేశంగా మార్చాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆయన అన్నారు. మరోవైపు మణిపూర్‌లో పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ బీజేపీ ఎదురుదాడికి చేస్తోంది.

బీమథాంగ్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ నుంచి వందల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా లాక్కుందని స్పష్టమవుతోందన్నారు. దేశంలో అంగుళం భూమిని కూడా తీసుకోలేదని భారత ప్రధాని పచ్చి అబద్ధం చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. లడఖ్ ను వ్యూహాత్మక ప్రదేశంగా అభివర్ణించిన కాంగ్రెస్ నేత, తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాంగాంగ్ సరస్సును సందర్శించినప్పుడు లడ‌ఖ్ లో భూమిని పొరుగు దేశం దొంగిలించిందని తనకు స్పష్టమైందని అన్నారు. ప్రధాని చెప్పిన దాంట్లో నిజం లేదని ల‌డ‌ఖ్ లోని ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఇక కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ, రాబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ల‌డ‌ఖ్ లోని ప్రతి మూలను సందర్శించిన రాహుల్ గాంధీ పేద ప్రజలు, తల్లులు, సోదరీమణులతో మాట్లాడాననీ, వారి హృదయాల్లో ఏముందో అర్థం చేసుకున్నానని చెప్పారు. ఇతర మంత్రులు తమ మన్ కీ బాత్ గురించి మాట్లాడుతున్నారనీ, మీ మన్ కీ బాత్ ను నేను వినాలని అనుకున్నానని ప్రధాని మోడీ, ఆయన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'పై మరోసారి విరుచుకుపడ్డారు.

తన 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా లడ‌క్ ను సందర్శించలేకపోవడంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'యాత్ర శ్రీనగర్ లో ఆగలేదు, శీతాకాలంలో మంచు కారణంగా లడ‌ఖ్ కు చేరుకోలేక‌పోయింద‌నీ, అయితే, తాను ఎలాగైన ఇక్క‌డ‌కు రావాల‌నేది త‌న హృద‌యంలో ఉంద‌నీ, అందుకే కాలిన‌డ‌క‌న కాకపోయినా మోటారు సైకిల్ పై (పాంగాంగ్ సరస్సు వరకు) ముందుకు తీసుకెళ్లాన‌ని చెప్పారు. దేశంలో బీజేపీ, ఆరెస్సెస్ వ్యాప్తి చేస్తున్న విద్వేషం, హింసకు వ్యతిరేకంగా నిలవడమే ఈ యాత్ర లక్ష్యమన్నారు. ''యాత్ర నుండి వచ్చిన సందేశం - 'నఫ్రత్ కే బజార్ మే హమ్ మొహబ్బత్ కీ దుకాన్ ఖోల్నే నిక్లే హై' (ద్వేషం మార్కెట్లో, మేము ప్రేమ దుకాణాన్ని తెరుస్తాము). గత కొన్ని రోజులుగా ఈ విషయాన్ని నేనే స్వయంగా చూశాను'' అని బహిరంగ సభలో రాహుల్ గాంధీ అన్నారు.