మణిపూర్ హింసపై విచారణకు కమిటీ: పోలీసుల తీరుపై సుప్రీం సీరియస్ వ్యాఖ్యలు
మణిపూర్ హింసపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది.ఈ విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పోలీసుల తీరుపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

న్యూఢిల్లీ:మణిపూర్ హింసాత్మక ఘటనలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. మణిపూర్ లో చోటు చేసుకున్న ఘటనలపై సుప్రీంకోర్టు సోమవారంనాడు విచారణ నిర్వహించింది.
మణిపూర్ హింసపై తాము ఏర్పాటు చేసే కమిటీలో మహిళా జడ్జిలతో పాటు నిపుణులుంటారని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
ప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెందితే తమ జోక్యం ఉండేది కాదన్నారు. మే 4 నుండి 18 వరకు పోలీసులు ఏం చేశారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.
ఎఫ్ఐఆర్ దాఖలుకు 14 రోజులు ఎందుకు పట్టిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మే 14 నుండి 18 వరకు పోలీసులు ఏం చేశారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.సీబీఐ, సిట్ లను మాత్రమే నమ్ముకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బాధితురాలికి ఇంటి గుమ్మం ముందే న్యాయం అందాల్సిన అవసరం ఉందని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పటికే 3 నెలలు గడిచిపోయిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
అయితే ప్రభుత్వం ఏమీ దాచిపెట్టలేదని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించవచ్చని తుషార్ మెహతా చెప్పారు. విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.