మణిపూర్ కు శాంతి కావాలని, వెంటనే దానిని పునరుద్దరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. సహాయక శిబిరాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని సూచించారు. శుక్రవారం ఆయన మొయిరాంగ్ ను సందర్శించారు. 

మణిపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజైన శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొయిరాంగ్ ను సందర్శించారు. అక్కడి సహాయక సిబిరాలను పరిశీలించారు. పలువురు బాధితులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మణిపూర్ లోని నాగా కమ్యూనిటీ అత్యున్నత సంస్థ అయిన యునైటెడ్ నాగా కౌన్సిల్ ప్రతినిధులు, షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ, జేఎన్ యూ ప్రొఫెసర్ బిమోల్ ఎ సహా ప్రముఖులతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సమావేశమయ్యారు.

అరుదైన రాజకీయ సన్నివేశం.. దిగ్విజయ్ సింగ్ ను ప్రశంసించిన నితిన్ గడ్కరీ.. ఒకే వేదికపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు

తరువాత మణిపూర్ గవర్నర్ ను కలిశారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ కు శాంతి అవసరమన్నారు. ఇక్కడ శాంతిని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాని అన్నారు. తాను కొన్ని సహాయ శిబిరాలను సందర్శించానని, ఈ సహాయ శిబిరాల్లో అసౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే సరి చేయాలని కోరారు. మణిపూర్ శాంతి కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

Scroll to load tweet…

కాగా.. మణిపూర్ ను సందర్శించేందుకు తన కాన్వాయ్ తో కలిసి చురచంద్ పూర్ వెళ్తున్న రాహుల్ గాంధీని గురువారం బిష్ణుపూర్ లో పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలో ఇది చోటు చేసుకుంది. అంతకుముందు ఆయన ఢిల్లీ నుంచి ఇంఫాల్ చేరుకున్నారు. మార్గమధ్యంలో హింస చెలరేగుతుందనే భయంతో కాన్వాయ్ ను నిలిపివేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

కాగా.. హింసాకాండతో అతలాకుతలమైన మణిపూర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించడంపై స్పందించిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రాష్ట్రం అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించకూడదని అన్నారు. మణిపూర్ లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని శర్మ మీడియాకు తెలిపారు.

పోలీస్ స్టేషన్ లోనే బాలికపై ఇన్ స్పెక్టర్ లైంగిక వేధింపులు.. రాత్రంగా లాకప్ లో ఉంచుకొని, నగ్న చిత్రాలు తీసి..

మణిపూర్ కు ఇతర రాజకీయ వ్యక్తులు వెళ్లాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మాత్రమే రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించగలవని శర్మ అన్నారు. ‘‘ఇంకొందరు ఒకటి రెండు రోజుల్లో వస్తారు. తిరిగి వెళ్తారు. వారి సందర్శనలతో పరిష్కారం లభించదు. ఇది మీడియా దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది’’ అని ఆయన అన్నారు.