మణిపూర్ రణరంగంగా మారింది.. అసమర్థ సీఎంను తొలగించాలి - కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
మణిపూర్ రణరంగంగా మారిపోయిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దీనికి కారణం బీజేపీయే అని ఆయన ఆరోపించారు. అసమర్థ సీఎంను పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

మణిపూర్ లో మళ్లి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు, హింసాకాండ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. మణిపూర్ యుద్ధభూమిగా మారపోయిందని, పాలన చేతగాని సీఎంను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
వారెవ్వా.. కరెంట్ షాక్ కు గురైన 4 ఏళ్ల చిన్నారిని చాకచక్యంగా కాపాడిన వృద్ధుడు.. వీడియో వైరల్
147 రోజులుగా మణిపూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కానీ ప్రధాని మోడీకి ఆ రాష్ట్రాన్ని సందర్శించే సమయం లేదని మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ‘‘ఈ హింసాకాండలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న భయానక దృశ్యాలు మరోసారి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘర్షణలో మహిళలు, పిల్లలపై హింసను ఆయుధంగా మార్చుకున్నట్లు ఇప్పుడు స్పష్టమవుతోంది.అందమైన రాష్ట్రమైన మణిపూర్ రణరంగంగా మారిపోయింది, ఇదంతా బీజేపీ వల్లే!’’ అని ఖర్గే ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అసమర్థుడని, ఆయనను పదవి నుంచి తొలగించాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. మరింత కల్లోలాన్ని నియంత్రించడానికి ఇది తొలి అడుగు అవుతుందని అన్నారు.
కాగా.. జూలైలో అదృశ్యమైన మెయిటీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు విద్యార్థుల హత్యతో మణిపూర్ లో కొత్త ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితులు చక్కబడ్డాయని మంగళవారం రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన వెంటనే.. సాయుధ బృందానికి చెందిన తాత్కాలిక జంగిల్ క్యాంపులోని గడ్డి ఆవరణలో ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా పడి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బందితో ఘర్షణకు దిగారు, 25 నుండి 30 మంది నిరసనకారులు గాయపడ్డారు.
6 రాష్ట్రాలు, 51 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు.. ఎందుకంటే ?
ఇదిలావుండగా, ఇద్దరు విద్యార్థుల హత్య, కిడ్నాప్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఏజెన్సీ స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారుల బృందం నేడు ఇంఫాల్ కు చేరుకోనుంది. స్పెషల్ క్రైమ్, క్రైమ్ సీన్ రిక్రియేషన్, ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ సర్వైలెన్ లో నైపుణ్యం ఉన్న అధికారులు ఈ బృందంలో ఉంటారని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదించింది.
వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 100 మంది మృతి, 150 మందికి గాయాలు
ఈ ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. అదృశ్యమైన విద్యార్థుల విషాద మరణానికి సంబంధించి విచారకరమైన వార్తల వెలుగులో రావడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం రెండూ పనిచేస్తాయని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. కలిసి దోషులను పట్టుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.