అపార్థాలు, స్వార్థ ప్రయోజనాల చర్యలు, విదేశీ కుట్రల వల్ల మణిపూర్ లో మరణాకాండ జరుగుతోందని, ప్రజలు చంపబడుతున్నారని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ పేర్కొన్నారు. 

మణిపూర్‌లో కొన్ని అపార్థాలు, స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రల కారణంగా మరణాకాండ జరుగుతోందని, ప్రజలు చంపబడుతున్నారని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ పేర్కొన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. మణిపూర్ రైఫిల్స్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరంముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. హింసను అరికట్టాలని, రాష్ట్రాన్ని వేగవంతమైన ప్రగతి పథంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 

స్వార్థ ప్రయోజనాలు గల వ్యక్తులు దేశాన్ని అస్థిరపరుస్తున్నారనీ, విదేశీ కుట్రల ఫలితంగా రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వందలాది, కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, చాలా మంది ప్రజలు సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారని ముఖ్యమంత్రి వాపోయారు. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బాధిత ప్రజలకు త్వరలో పునరావాసం కల్పిస్తామని సింగ్ చెప్పారు. స్వస్థలాలకు తరలించలేని వారిని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లలో తాత్కాలికంగా ఉంచుతామని తెలిపారు.