మాండ్య లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

శివనంజప్ప, ఎస్ఎం కృష్ణ, అంబరీష్, సుమలత, రమ్య, మాదే గౌడ వంటి సెలబ్రెటీలు మాండ్య నుంచి ఎంపీలుగా గెలుపొందారు. శివనంజప్ప 4 సార్లు, అంబరీష్ 3 సార్లు, ఎస్ ఎం కృష్ణ మూడు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, జేడీఎస్ 5 సార్లు, జనతా పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు. మాండ్య, మైసూరు జిల్లాల్లో విస్తరించి వుంది. ఈ సెగ్మెంట్ పరిధిలో మాలవల్లి, మద్దూర్, మేల్కోటే, మాండ్య, శ్రీరంగపట్టణ, నాగమంగళ, కృష్ణరాజపేట, కృష్ణరాజనగర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జేడీఎస్ తరపున ఇక్కడి నుంచి బరిలో దిగారు. జేడీఎస్‌కు, దేవెగౌడ కుటుంబానికి మాండ్య ప్రాంతంలో మంచి పట్టుంది. ఒక్కలిగ సామాజికవర్గానిదే మాండ్యలో ఆధిపత్యం. ఇక కాంగ్రెస్ నుంచి స్టార్ చంద్రు బరిలో దిగనున్నారు. 

Mandya Lok Sabha elections result 2024 ksp

మాండ్య.. ఈ పేరు వినగానే కావేరి నది గల గలలు , చెరకు పంట, షుగర్ ఫ్యాక్టరీలు , పచ్చని పొంట పొలాలు గుర్తొస్తాయి. కర్ణాటకలోని కీలకమైన లోక్‌సభ స్థానమే కాదు.. వీఐపీ సెగ్మెంట్‌గానూ మాండ్యకు పేరు. హేమాహేమీలు, సినీనటులు ఈ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. శివనంజప్ప, ఎస్ఎం కృష్ణ, అంబరీష్, సుమలత, రమ్య, మాదే గౌడ వంటి సెలబ్రెటీలు మాండ్య నుంచి ఎంపీలుగా గెలుపొందారు. శివనంజప్ప 4 సార్లు, అంబరీష్ 3 సార్లు, ఎస్ ఎం కృష్ణ మూడు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. పూర్తిగా వ్యవసాయాధారిత నియోజకవర్గమైన మాండ్యపై కాంగ్రెస్, జేడీఎస్ పట్టుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, జేడీఎస్ 5 సార్లు, జనతా పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు.  

మాండ్య ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ కంచుకోట :

మాండ్య లోక్‌సభ నియోజకవర్గం.. మాండ్య, మైసూరు జిల్లాల్లో విస్తరించి వుంది. ఈ సెగ్మెంట్ పరిధిలో మాలవల్లి, మద్దూర్, మేల్కోటే, మాండ్య, శ్రీరంగపట్టణ, నాగమంగళ, కృష్ణరాజపేట, కృష్ణరాజనగర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్య పరిధిలోని 8 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ 6 చోట్ల, సర్వోదయ కర్ణాటక పక్ష , జేడీఎస్ ఒక్కో చోట విజయం సాధించాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దివంగత సినీనటుడు అంబరీష్ సతీమణి , సినీనటి సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగి 7,03,660 ఓట్లు.. జేడీఎస్ అభ్యర్ధి నిఖిల్ కుమార్ స్వామికి 5,77,784 ఓట్లు సంపాదించారు. మొత్తంగా సుమలత 1,25,876 ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. మాండ్యలో తన కుటుంబానికి తిరుగులేదని నిరూపించారు. 

మాండ్య ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. మరోసారి బరిలో హేమాహేమీలు :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. మరోసారి మాండ్యపై అందరి దృష్టి పడింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జేడీఎస్ తరపున ఇక్కడి నుంచి బరిలో దిగారు. జేడీఎస్‌కు, దేవెగౌడ కుటుంబానికి మాండ్య ప్రాంతంలో మంచి పట్టుంది. ఒక్కలిగ సామాజికవర్గానిదే మాండ్యలో ఆధిపత్యం. ఇక కాంగ్రెస్ నుంచి స్టార్ చంద్రు బరిలో దిగనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటంతో పాటు మాండ్య లోక్‌సభ పరిధిలో హస్తం పార్టీ బలంగా వుండటంతో తాను సునాయాసంగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ సుమలత తాను పోటీ చేసే విషయాన్ని ఏప్రిల్ 3న ప్రకటించనున్నారు. మరోసారి స్వతంత్ర అభ్యర్ధిగానే ఆమె బరిలో దిగే అవకాశాలున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios