పాట్నా: ఈ ఎన్నికల్లో తమ కూటమికి ఓట్లేసిన ప్రజలందరికీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.

 

గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్ ప్రజలు మహాకూటమికి అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. కానీ ఈసీ మాత్రం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

also read:బీహార్ సీఎం నితీష్ కుమారే: తేల్చి చెప్పిన బీజేపీ

బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. మహాకూటమి కంటే 12,270 ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు.  అయితే ఆశ్చర్యకరంగా ఎన్డీఏ 15 సీట్లు అధికంగా గెలుచుకొందన్నారు. 

also read:బీహార్‌లో ఘోర పరాజయం: కాంగ్రెస్‌‌లో మరోసారి అసమ్మతి, గాంధీ కుటుంబంపై ప్రశ్నలు

పోస్టల్ బ్యాలెట్లను తొలుత లెక్కించకుండా చివరికి లెక్కించిన అన్ని నియోజకవర్గాల్లో ఓట్లను తిరిగి లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు.తాము సుమారు 20 సీట్లలో అతి తక్కువ మెజారిటీతో ఓటమి పాలైనట్టుగా ఆయన చెప్పారు.


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మేజిక్ ఫిగర్ కంటే 12 తక్కువ సీట్లు ఆర్జేడీ నేతృత్వంలో కూటమికి వచ్చాయి. తమ కూటమిపై విశ్వాసం చూపి ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో యాత్ర చేపట్టనున్నట్టుగా ఆయన చెప్పారు.పోస్టల్ బ్యాలెట్లను రద్దు చేయడంపై ఆయన ఈసీపై ప్రశ్నల వర్షం కురిపించారు.  ఒకరి ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. 

దీంతో 500 నుండి 9000 వరకు పోస్టల్  బ్యాలెట్లను రద్దు చేసిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ల రద్దు ఎవరి ఒత్తిడితో జరిగిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రద్దు చేసిన పోస్టల్ బ్యాలెట్లను తిరిగి లెక్కించాలని ఆయన కోరారు.  పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.