‘‘ఈ సారి ముఖానికి ఆవుపేడ పూసుకో, ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా‘‘

Man whom Anushka Sharma scolded for littering hits back on Facebook, post gets over 500 shares
Highlights

విరాట్, అనుష్కలకు నెటిజన్ల సెటైర్లు

సెలబ్రెటీ కపుల్ విరాట్, అనుష్క జంటకు చేదు అనుభవం ఎదురైంది. వారు మంచి చేయాలని భావించినా.. తిరిగి వారికి చెడు ఎదురైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ఇటీవల అనుష్క, విరాట్‌ కలిసి కారులో వెళుతుండగా పక్కనే కారులో వెళుతున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్లాస్టిక్‌ కవరును రోడ్డుపై పడేశాడు. అది గమనించిన అనుష్క కారు ఆపి మరీ అతని ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోడ్డుపై ప్లాస్టిక్‌ ఎందుకు పారేస్తున్నారు? డస్ట్‌బిన్‌ ఉపయోగించండి’ అని కేకలు వేశారు.

అనుష్క అతన్ని తిడుతున్నప్పుడు పక్కనే ఉన్న విరాట్‌ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘వీళ్లా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేది? ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే వారిని ప్రశ్నించండి. అవగాహన కల్పించండి’ అని ట్వీట్‌ చేశారు.   ఈ ఘటనపై అర్హాన్ వెంటనే క్షమాపణలు చెప్పాడు. అయితే.. విరాట్, అనుష్కలపై మాత్రం ఫుల్ గా సీరియస్ అయ్యాడు.

‘నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు వేసింది. ఇది మీకు మర్యాద అనిపించుకోదు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అర్హాన్‌ తల్లి కూడా స్పందించారు. తన కుమారుడు చేసింది తప్పే కానీ అతన్ని పట్టుకుని రోడ్డుపై తిట్టడం సబబు కాదని అన్నారు. వీరితో పాటు నెటిజన్లు కూడా అనుష్కపై సెటైర్లు వేశారు.

‘అనుష్క..రోడ్డుపై వెళ్లే వారినే కాదు మైదానంలో నోటికొచ్చినట్లు తిట్టే నీ భర్తను కూడా కంట్రోల్‌లో పెట్టు’

‘మీరు సెలబ్రిటీ. మ్యాచుల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. మీరు బూతులు మాట్లాడినప్పుడలా కెమెరాను స్లోమోషన్‌లో పెట్టొద్దు అని చెప్తారా? మిమ్మల్ని చూసి చాలా మంది అలా తిట్టడం ఫ్యాషన్‌ అనుకుంటున్నారు. అప్పుడు మీ విలువలు ఏమైపోయాయి?’

‘కేక్‌ మొత్తం ముఖానికి పూసుకుని దానిని వృథా చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారులు తిండిలేక అలమటిస్తున్నారు. ఈసారి కేక్‌కు బదులు ఆవు పేడ పూసుకో’

‘అనుష్కకు రోడ్డుపై చెత్త పారేస్తున్నారన్న చింత కంటే..దానిని వెంటనే వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయాలన్న ఆతృతే ఎక్కువగా ఉన్నట్టుంది. లేకపోతే అనుష్క అంతగా అరుస్తున్నప్పుడు విరాట్‌కు వీడియో తీయాలన్న ఆలోచన ఎలా వస్తుంది? వీళ్లు కూడా సచిన్‌ తెందుల్కర్‌లాగే ప్రవర్తిస్తున్నారు. ఆయన కూడా అంతే.. బైక్‌పై ఎవరు వెళ్తున్నా హెల్మెట్‌ పెట్టుకోండి అని చెబుతూనే ఉంటారు’

‘చెత్తపడేశాడని అనుష్క తిట్టడంలో తప్పులేదు. కానీ ఆ వ్యక్తి వివరాలు షేర్‌ చేయాల్సిన అవసరం ఏముంది?’

‘కోహ్లీ..మీ భార్య హీరోయిజాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇలా రోడ్డుపై చెత్త వేసేవారిని తొలిసారి చూస్తున్నారా? ఒకవేళ అతనికి బుద్ధిచెప్పాలనుకుంటే స్నేహపూర్వకంగా మాట్లాడాలి. అంతేకానీ బాస్‌లా ప్రవర్తించకూడదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

loader