Asianet News TeluguAsianet News Telugu

Chennai Rains: భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి.. ఎస్ఐ రాజేశ్వరి కాపాడిన వ్యక్తి మృతి

భారీ వర్షాలతో తమిళనాడు (tamilnadu rains) రాజధాని చెన్నై వణికిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా ఎస్సై రాజేశ్వరి చేసిన సాహసం వైరల్ అయ్యింది. చెట్ల కొమ్మల మధ్యలో అపస్మారక స్థితిలో పడివున్న అభాగ్యుడిని స్వయంగా భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు.

man who was saved by si rajeswari in chennai died in hospital
Author
Chennai, First Published Nov 13, 2021, 7:08 PM IST

భారీ వర్షాలతో తమిళనాడు (tamilnadu rains) రాజధాని చెన్నై వణికిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా ఎస్సై రాజేశ్వరి చేసిన సాహసం వైరల్ అయ్యింది. చెట్ల కొమ్మల మధ్యలో అపస్మారక స్థితిలో పడివున్న అభాగ్యుడిని స్వయంగా భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమెకు దేశ ప్రజలు సెల్యూట్ చేశారు. తమిళనాడు సీఎం (tamilnadu cm) స్టాలిన్ (mk stalin) ఆమెను స్వయంగా పిలిపించుకుని.. ప్రశంసాపత్రం అందజేశారు. అయితే ఎస్సై రాజేశ్వరి శ్రమ వృథా అయ్యింది. దురదృష్టవశాత్తూ సదరు బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

కాగా.. చెన్నైలో కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సాయం కోసం ప్రజలు సంప్రదించడానికి కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. అవసరమున్న చోటుకు విపత్తు నిర్వహణ బృందాలతో పాటుగా స్థానిక ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేరుకుని సాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీ చత్రం (TP Chatram) ప్రాంతంలోని శ్మశాన వాటికలో చెట్టు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. 

Also Read:Chennai Cop Rajeswari: హ్యాట్సాఫ్.. వ్యక్తిని భుజాలపై మోసుకెళ్లిన ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి.. వైరల్ వీడియో

దీంతో టీపీ ఛత్రం పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి (Chennai inspector Rajeswari ) తన తోటి పోలీసులతో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. శ్మశాన వాటికలో 3 రోజులుగా పనిచేస్తున్న ఉదయ్‌కుమార్ అనే 25 ఏళ్ల స్పృహ తప్పి పడిపోయాడు. అయితే అతను చనిపోయినట్టుగా భావించినప్పటికీ అతడు ప్రాణాలతో ఉన్నట్టుగా తేలింది. దీంతో పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి ఏ మాత్రం సమయం వృథా చేయకుండా అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. 

ఎవరి సాయం తీసుకోకుండా అతడిని తన భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగింది. తొలుత పోలీసు వాహనంలో ఉన్న దుప్పట్లును తీసుకుని.. అతని ఆటో వద్దకు తీసుకెళ్లింది. ఆటో వద్దకు చేరిన తర్వత అందులో దుప్పట వేసి.. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సహాయక చర్యల్లో మహిళ పోలీసు రాజేశ్వరి చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయ్ కుమార్ శ్మశాన వాటికలో పనిచేసే వ్యక్తి.

Follow Us:
Download App:
  • android
  • ios